నోటీస్‌బోర్డు

కొంకణ్‌ రైల్వేలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు నవీ ముంబయిలోని కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 11 ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 10 Jun 2024 00:32 IST

వాక్‌-ఇన్‌

కొంకణ్‌ రైల్వేలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

నవీ ముంబయిలోని కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 11 ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01
  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 08
  • సీఏడీ/ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌: 01
  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌: 01

అర్హత: ఐటీఐ/డిప్లొమా, సివిల్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం.
వేతనం: సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.44,900, సీఏడీ/ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పోస్టుకు రూ.35,400, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.58,100.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 15, 20, 24, 25, 27.
వేదిక: ఎగ్జిక్యూటివ్‌ క్లబ్, కొంకణ్‌ రైల్‌ విహార్, కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్, సీవుడ్స్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర, సెక్టార్‌-40, సీవుడ్స్‌ (వెస్ట్‌), నవీ ముంబయి.
వెబ్‌సైట్‌: https://konkanrailway.com/


ఉద్యోగాలు

బాల్మర్‌ అండ్‌ లారీలో జూనియర్‌ ఆఫీసర్లు  

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న బాల్మర్‌ అండ్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ (కోల్‌కతా) 14 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • గ్రీసెస్‌ అండ్‌ లూబ్రికెంట్స్‌: 03
  • ఇండస్ట్రియల్‌ ప్యాకేజింగ్‌: 1
  • లాజిస్టిక్‌ సర్వీస్‌: 01

పోస్టులు: జూనియర్‌ ఆఫీసర్‌ (ప్రొడక్షన్‌/ క్వాలిటీ అస్యూరెన్స్, ఎస్సీఎం/ ఎలక్ట్రికల్‌/ ఆపరేషన్స్‌)
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.
వేతనం: నెలకు రూ.21,750- రూ.65,000.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
జాబ్‌ లొకేషన్‌: చెన్నై, కోల్‌కతా, సిల్వెస్సా, బరోడా, తలోజ, ముంబయి, హైదరాబాద్‌.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-07-2024.
వెబ్సైట్‌: https://www.balmerlawrie.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని