ఎన్‌ఐఎన్‌లో క్లర్క్‌ అవుతారా?

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) లోయర్‌ డివిజన్‌ క్లర్క్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-సీ) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.

Published : 10 Jun 2024 00:33 IST

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) లోయర్‌ డివిజన్‌ క్లర్క్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-సీ) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి.

1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-6: పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌ పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్‌ చేయాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
2. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-7: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌ టైపింగ్‌ వేగం నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
3. లైబ్రరీ క్లర్క్‌-1: పదో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌ చదివిన వారికి ప్రాధాన్యం. లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు.
4. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-1: లైబ్రరీ సైన్స్‌/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేయాలి. కేంద్ర/ పీఎస్‌యూ/ యూనివర్సిటీ/ పరిశోధన/ విద్యా సంస్థల్లో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్‌ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై సంవత్సరాల వరకూ, కేంద్ర ప్రభుత్వ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు నలబైఐదు ఏళ్ల వరకూ సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/మహిళలకు రూ.1000. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ఎలా?

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో 90 ప్రశ్నలకు 90 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

లోయర్‌ డివిజన్‌ క్లర్క్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు:

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు - 25 మార్కులు
2. జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు - 20 మార్కులు
3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 20 ప్రశ్నలు - 20 మార్కులు
4. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 25 ప్రశ్నలు - 25 మార్కులు

ఈ పరీక్షలో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీలు 45 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఇతరులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. సీబీటీలో కనీసార్హత మార్కులు సాధించినవారిని 1:3 లేదా 1:5 నిష్పత్తిలో స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌: దీంట్లో భాగంగా కంప్యూటర్‌ పైన టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. వ్యవధి పది నిమిషాలు. టైపింగ్‌ వేగం ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు ఉండాలి.

లైబ్రరీ క్లర్క్‌ పోస్టు: ఐదు అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు
2. జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు
3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు
4. ఇంగ్లిష్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు
5. లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ 50 ప్రశ్నలు - 50 మార్కులు

లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ పోస్టు:  ప్రశ్నపత్రంలో లైబ్రరీ క్లర్క్‌ పోస్టుకు మాదిరిగానే జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ల్లో 90 ప్రశ్నలకు 90 మార్కులు.
వ్యవధి 90 నిమిషాలు.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2024
అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: జులై 2024
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: జులై 2024
వెబ్‌సైట్‌: www.nin.res.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని