CUET (PG) Exams: సీయూఈటీ -పీజీ పరీక్షల తేదీలు ఖరారు

సీయూఈటీ(పీజీ) పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ తేదీలను యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్ కుమార్‌ ట్విటర్‌లో ప్రకటించారు.

Updated : 20 Apr 2023 16:05 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (CUET-PG) తేదీలు ఖరారయ్యాయి. జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూజీసీ(UGC) ఛైర్మన్‌ మామిడాల జగదీశ్ కుమార్‌ వెల్లడించారు. జూన్‌ 5, 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో ఈ పరీక్షలు జరగనుండగా.. తదుపరి అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు NTA అధికారిక వెబ్‌సైట్‌లను చెక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

మరోవైపు, సీయూఈటీ (పీజీ) దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 19తో ముగియడంతో ఆ గడువును మే 5వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పీజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు మే 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకొనేందుకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించారు. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది.

సీయూఈటీ(పీజీ) పరీక్ష రిజిస్ట్రేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని