aposs tenth inter results released: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ ఫలితాల విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

APOSS 10th, Inter Results | ఏపీలో ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 25 Apr 2024 19:33 IST

APOSS 10th, Inter Results | అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ గురువారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగ్గా..  ఏప్రిల్‌ 12 నుంచి 16 వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించిన అధికారులు తాజాగా ఫలితాలు ప్రకటించారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది; ఇంటర్‌ పరీక్షలకు 73,550 మంది చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతిలో 18,185 మంది (55.81శాతం), ఇంటర్‌లో 48,377 మంది (65.77శాతం) ఉత్తీర్ణత సాధించారు.

పదో తరగతి ఫలితాలు ఇంటర్‌ ఫలితాలు

ఏప్రిల్‌ 29 నుంచి మే 7 వరకు రీ వాల్యుయేషన్‌ /రీకౌంటింగ్‌ అవకాశం కల్పిస్తున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు  జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ 10 నుంచి 12 వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్ష ఫీజును ఏప్రిల్‌ 29 నుంచి మే 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు