APOSS exam Results: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జూన్‌లో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్‌ (APOSS) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు.

Published : 01 Jul 2024 19:06 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జూన్‌లో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్‌ (APOSS) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 15,058 మంది రాయగా.. 9,531 మంది (63.30శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఇంటర్‌ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా..  18,842 మంది (69.07 శాతం) ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. ఫలితాలను https://apopenschool.ap.gov.inలో తెలుసుకోవచ్చని సూచించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని