AP TET: నేడే ఏపీ టెట్‌ ఫలితాలు

ఏపీ టెట్‌ (AP TET) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Updated : 25 Jun 2024 11:16 IST

అమరావతి: ఏపీ టెట్‌ (AP TET) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం తర్వాత ఫలితాలు విడుదల చేసే అవకాశముంది.

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్‌ నిర్వహించారు. 2.35లక్షల మంది దీనికి హాజరయ్యారు. ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్‌ కారణంగా వెల్లడించలేదు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని