AP TET 2024: ఏపీ టెట్‌ షెడ్యూల్‌ విడుదల.. సిలబస్‌ ఇదే..

ఏపీలో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు షెడ్యూల్‌ విడుదలైంది.

Updated : 01 Jul 2024 22:26 IST

అమరావతి: ఏపీలో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి 20వ తేదీవరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. మరోవైపు, మెగా డీఎస్సీకి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

టెట్ షెడ్యూల్‌ ఇదే..

  • టెట్‌ నోటిఫికేషన్‌: జులై 2న
  • ఫీజు చెల్లింపు: జులై 3 నుంచి 16వరకు
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 4 నుంచి 17వరకు
  • జులై 16 నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు అందుబాటులోకి
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జులై 25 నుంచి
  • పరీక్షలు: ఆగస్టు 5 నుంచి 20వరకు (రెండు సెషన్లలో)
  • ప్రొవిజినల్‌ కీ : ఆగస్టు 10
  • ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 11 నుంచి 21వరకు
  • తుది కీ విడుదల: ఆగస్టు 25
  • ఫలితాలు విడుదల: ఆగస్టు 30

టెట్‌ సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు