AP Lawcet results: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో న్యాయ విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 27 Jun 2024 20:53 IST

గుంటూరు: ఏపీలో లాసెట్‌(AP LAW CET), పీజీ ఎల్‌ సెట్‌ (PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలోని  న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ(LLB), రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ 9న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

మొత్తంగా ఈ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు.. 17,117 మంది (89.04%) శాతం ఉత్తీర్ణత సాధించినట్లు లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య బి.సత్యనారాయణ తెలిపారు. రెండేళ్ల పీజీ కోర్సులో 99.51శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. మూడేళ్ల ఎల్.ఎల్.బి కోర్సులో 89.74%, ఐదేళ్ల ఎల్.ఎల్.బి కోర్సులో 80.06% చొప్పున అర్హత సాధించినట్లు వెల్లడించారు.

తొలి మూడు ర్యాంకర్లు వీరే..

రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో పొట్లూరి అభినేత్‌ జాసన్‌ (కృష్ణా జిల్లా) మొదటి ర్యాంకు సాధించగా.. దీప్తి నూకల (గుంటూరు) రెండు, నువ్వుల జాహ్నవి (ఎన్టీఆర్‌ జిల్లా) మూడో ర్యాంకులో మెరిశారు. అలాగే, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో కుసుం అగర్వాల్‌ (విజయనగరం) మొదటి ర్యాంకు, ఆర్‌.పి.విజయ నందిని (మల్కాజ్‌గిరి) రెండో ర్యాంకు, గోపిశెట్టి విజయ్‌ ఆదిత్య శ్రీవాత్సవ్‌ మూడో ర్యాంకు సాధించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు సంబంధించి కృష్ణ చైతన్య యామల (తిరుపతి) తొలి ర్యాంకు సాధించగా.. హర్ష వర్దన్‌ రాజు (కోనసీమ) రెండు, చెల్లుబోయిన రేవంత్‌ రాయ్‌ (తూర్పుగోదావరి) మూడో ర్యాంకుతో సత్తా చాటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని