AP Inter Results: ఇంటర్‌ మార్కుల మెమో డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?ఇదిగో లింక్‌!

AP Inter Results Marks Memo: ఏపీలో ఇంటర్‌ విద్యార్థుల మార్కుల మెమోలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌ల ద్వారా మీ మెమోలను పీడీఎఫ్‌ రూపంలో పొందొచ్చు.

Updated : 30 Apr 2023 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (AP Inter Results) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్‌లో మొత్తంగా 66.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే, తాజాగా ఇంటర్‌ బోర్డు విద్యార్థుల మార్కుల మెమోలను (Marks memo) వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా మార్కుల మెమోను సులువుగా పొందొచ్చు. అందులో మీ ఫొటోతో పాటు మీరు సాధించిన మార్కుల వివరాలు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి మెమోలు పొందండి. 

 Inter 1st Year మార్కుల మెమో కోసం క్లిక్‌ చేయండి 


 Inter 2nd Year మార్కుల మెమో కోసం క్లిక్‌ చేయండి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని