AP TET Syllabus: ఏపీ టెట్ సిలబస్‌పై అపోహలొద్దు: విద్యాశాఖ కమిషనర్‌ విజ్ఞప్తి

ఏపీలో కొత్తగా నిర్వహించనున్న టెట్‌ పరీక్షకు పాత సిలబస్‌ ఉంచారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ స్పష్టంచేశారు.

Published : 02 Jul 2024 20:15 IST

అమరావతి: ఏపీలో టీచర్‌ పోస్టుల భర్తీకి  మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్‌, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ వెల్లడించారు. అయితే, టెట్‌ (జులై) పరీక్షకు పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదన్నారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్థారించినట్లు తెలిపారు. అందువల్ల దాన్నే వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని