AP DME Recruitment: పరీక్ష లేదు.. 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తులు షురూ!

ఏపీ వైద్య విద్యా విభాగంలో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి జులై 26వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 17 Jul 2023 16:17 IST

అమరావతి: ఏపీలోని వైద్య విద్యా విభాగంలో భారీగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 590 పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)  ఆన్‌లైన్‌ దరఖాస్తులు మొదలయ్యాయి. డీఎంఈ పరిధిలో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ సహా మొత్తం 44 విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

గుడ్‌న్యూస్‌.. ‘ఆయుష్‌’లో మెడికల్‌ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పీజీ డిగ్రీ (డీఎం/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ డీఎంఏ/ఐడీ)లో ఉత్తీర్ణ‌త సాధించాలని పేర్కొంది. అలాగే అభ్యర్థులకు వయో పరిమితి 42 ఏళ్లుగా నిర్ణయించింది.  అర్హులైన అభ్యర్థులు జులై 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. పీజీ ఫైనల్ ఎగ్జామ్‌లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు రుసుం జనరల్‌ అభ్యర్థులకైతే రూ.1000; బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ,  దివ్యాంగులకైతే  రూ.500ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://dme.ap.nic.in/వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఈ కింది నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని