News in pics: చిత్రం చెప్పే విశేషాలు (02-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 02 Jul 2024 09:37 IST
1/8
ఐటీ కారిడార్ దుర్గం చెరువు ఇనార్బిట్ మాల్ వద్ద సాయంత్రం వచ్చే బస్సు కోసం నిత్యం వందలాది ప్రయాణికులు నిరీక్షిస్తుంటారు. ఇతర వాహనాలు లేకపోవడంతో అందరికీ ఈ ఒక్క బస్సే ఆధారం.

2/8
ఇనార్బిట్ మాల్ వద్ద బస్సు రాగానే దాని వెంట పరుగులు తీసి మరీ ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. కాసింత సమయం తేడాతో మరో రెండు మూడు బస్సులు వేయాలని చిరుద్యోగులు కోరుతున్నారు.

3/8
ఆదిలాబాద్‌: ఆరు నెలలుగా నీరు లేక బోసిపోయిన జలపాతం వర్షపు నీటితో కనువిందు చేస్తోంది. బోథ్‌లోని పెద్దవాగు నుంచి ప్రవాహం పెరగటంతో జలపాతానికి నీరు వచ్చి చేరుతోంది. జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

4/8
హైదరాబాద్‌: సోమవారం ఘట్‌కేసర్‌ మండలం యంనంపేటలోని శ్రీనిధి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఎదులాబాద్‌లోని వ్యవసాయ పొలంలోకి దిగి వరి నాటు వేసి సంతోషపడ్డారు.

5/8
హైదరాబాద్‌: సోమవారం నెక్లెస్‌ రోడ్డులో అమ్మని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ 5 కే రన్‌ నిర్వహించారు. శాసనసభాపతి ప్రసాద్‌కుమార్, వికారాబాద్‌ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీత మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని బెలూన్లు ఎగురవేసి పరుగును ప్రారంభించారు.

6/8
మెదక్‌: సంగారెడ్డి బైపాస్‌ మార్గంలోని జయదుర్గా భవాని ఆలయ వార్షికోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకున్నారు.

7/8
ఆదిలాబాద్‌: ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతం జలకళ సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరి కనువిందు చేస్తోంది. ఎత్తయిన గుట్టల నడుమ 200 అడుగుల పైనుంచి జలువారే ఈ సెలయేటి సవ్వళ్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

8/8
ఖమ్మం:  నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరంలోని రాతి బావి సందర్శకులను ఆకట్టుకుంటోంది. బావిని వందల ఏళ్ల క్రితం రామదాసు కుటుంబ సభ్యులు వినియోగించినట్టు ప్రచారముంది. నేటికీ ధ్యానమందిర ఆవరణలోని పనులకు ఈ నీటినే వాడుతుండటం విశేషం.

Tags :

మరిన్ని