News in pics: చిత్రం చెప్పే విశేషాలు (27-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 27 Jun 2024 14:57 IST
1/24
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, చిత్రంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు

2/24
మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల మాటామంతీ..
మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల మాటామంతీ..
3/24
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి తుమ్మల , చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి,  మంత్రులు  పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు

4/24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, భట్టి, తుమ్మల తదితరులు

5/24
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ  కుటుంబసభ్యులతో కలిసి పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ముందు పాటపాడి అలరించిన దత్తాత్రేయ మనుమరాళ్లను ప్రధాని మోదీ అభినందించారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబసభ్యులతో కలిసి పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ముందు పాటపాడి అలరించిన దత్తాత్రేయ మనుమరాళ్లను ప్రధాని మోదీ అభినందించారు.
6/24
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో వేటకెళ్లిన ఓ మత్స్యకారుడి వలకు భారీ నల్లమట్ట చేప లభ్యమైంది. ఈ జాతికి చెందిన చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. ఐదు అడుగుల పొడవుతో పాటు, సుమారు 80 కిలోల బరువు ఉంది. 

7/24
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సృజన బాధ్యతలు స్వీకరించడానికి  కుమారుడితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. తల్లి బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో కుమారుడు పక్కనే ఉన్నాడు. మీడియా సమావేశం ఉంది. ఇంటికెళ్లమని కలెక్టర్‌ కొడుక్కి చెప్పారు. వెళ్లనని మారాం చేస్తున్న కుమారుడిని దగ్గరకు తీసుకుని సముదాయించి సహాయకుల వద్దకు పంపారు.    

8/24
వసతిగృహంలో ఇద్దరు కుమారులను చేర్పించడానికి తండ్రి ఇలా ద్విచక్ర వాహనంపై ప్రమాదకరంగా తీసుకెళ్తున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ప్రమాదకర ప్రయాణం కనిపించింది.

9/24
వర్షాలు కురవక మొలకెత్తిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి రైతులు  ఆందోళన చెందుతున్నారు. వర్షం లేక సాగు భూములు నెర్రలువారుతున్నాయని, ఒక్కసారైనా వచ్చిపో అంటూ రైతులు వరుణ దేవుడిని వేడుకుంటున్నారు.  

10/24
ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం మొదలయ్యింది. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. అంతా హదరాబాద్‌లోని  చైతన్యపురి మెట్రో స్టేషన్‌ కింద బైక్‌ రేసింగ్‌కు సిద్ధంగా ఉన్నట్టు వరసలో ఉన్నారు. వర్షం తగ్గేదాకా వేచి ఉండి తర్వాత వెళ్లిపోయారు.

11/24
లైక్స్, వ్యూస్‌ కోసం కొంతమంది యువత ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఓ యువకుడు తన కొత్త బైక్‌ను ఒడ్డు చివర    ప్రమాదకరంగా నిలిపి ఇలా రీల్స్‌ చేస్తూ కనిపించాడు 

12/24
హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్‌పై ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు బల్లను ప్రమాదకరంగా పట్టుకెళ్లడమే కాదు.. మరోవైపు మహిళ చరవాణిలో మాట్లాడుతుండగా  తీసిన చిత్రమిది.

13/24
హైదరాబాద్‌: ముషీరాబాద్‌లోని వీఎస్‌టీ పార్కును జీహెచ్‌ఎంసీ రూ.40 లక్షలతో అందంగా రూపుదిద్దుతోంది. ఈత కొట్టేందుకు చిన్నారులు బావుల్లో దూకుతున్నట్లుగా తీర్చిదిద్దుతున్న బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి.

14/24
మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలు, అనర్థాలపై శ్రీకాకుళం నగరంలో బుధవారం జోష్‌ శివ బృందం వినూత్నంగా ప్రదర్శించిన ఫ్లాష్‌ మాబ్‌ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

15/24
హైదరాబాద్‌: హీరో ప్రభాస్‌ సినిమా కల్కి విడుదల నేపథ్యంలో బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సందడి నెలకొంది. ఆయన అభిమానులు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

16/24
విశాఖపట్నం: చింతపల్లి మండలంలోని లంబసింగి కొండల్లో పొగమంచు సోయగాలు ప్రకృతిప్రియుల మనసును హత్తుకుంటున్నాయి. పచ్చనికొండల నడుమ పొగమంచు అందాలు అబ్బురపరుస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

17/24
తమిళనాడు: తిరువళ్ళూరు సమీప తిరుపందియూరులో పురాతన సెల్వ వినాయకుడి ఆలయం ఉంది. బుధవారం 11,108 లడ్డూలతో సెల్వ వినాయకుడిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

18/24
విశాఖపట్నం: ఇక్కడి అయిదు రోడ్ల కూడలిలోని శ్రీ బాల వినాయకస్వామి ఆలయం ముంగిట వారాహి అమ్మవారి ఆకృతిలో సహస్ర దీపాలంకరణ అందరినీ అలరించింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులు ఈ దీపారాధన నిర్వహించారు.

19/24
హైదరాబాద్‌: కేపీహెచ్‌బీకాలనీ ధర్మారెడ్డికాలనీలోని ఓ షోరూం వార్షికోత్సవంలో సినీ తారలు సందడి చేశారు. జబర్దస్త్‌ ఫేం వర్ష, సినీ నటి అమిక్షాపవార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ ప్రదర్శన ఆకట్టుకుంది.

20/24
హైదరాబాద్‌: సినీ తార అనన్య నాగళ్ల అమీర్‌పేటలో బుధవారం సందడి చేశారు. ఓ కార్యక్రమానికి హాజరై అభిమానులతో సందడి చేశారు. తనకు ఫిల్టర్‌ కాఫీ అంటే ఎంతో ఇష్టం, కాసింత అలసటగా అనిపిస్తే కాఫీ పడాల్సిందేనని చెప్పారు.

21/24
ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌లోని చెరువులో కొన్ని కొంగలు బుధవారం చేపల వేట కొనసాగించాయి. ఆ సమయంలో నీళ్లల్లో తలను పైకెత్తి మాత్రమే ముందుకు సాగుతూ సర్పాలను తలపించిన దృశ్యాలివి.

22/24
మహబూబ్‌నగర్‌: పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామ సమీపంలో రైతు దాసరి రాములు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కలుపు తొలగించేందుకు ట్రాక్టర్‌ అద్దె రూ.మూడు వేలు అవుతుందని యజమాని చెప్పడంతో ఓ వ్యక్తి వద్ద ఉన్న సైకిల్‌ను తీసుకుని వెనక టైరును తొలగించి గుంటక ఏర్పాటు చేసుకున్నారు.

23/24
వేట దృశ్యాలు ఈ సీజన్‌లో ఎన్నెన్నో! ఖమ్మం ప్రకాశ్‌ నగర్‌ వంతెన చప్టా వద్ద కొందరు యువకులు, చిన్నారులు బుధవారం సాగించిన మత్స్యవేట దృశ్యాలివి.

24/24
చిత్తూరు: బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులోని ఓ మండిలో కనిపించింది. చేప(బుడ్డపక్కీ చేప) ఆకారంలో ఉన్న ఈ కాయ చూపరులను ఆకట్టుకుంది. జన్యుపర లోపాల కారణంగా కాయల ఆకారాల్లో ఇలా మార్పులు చోటుచేసుకుంటాయని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

Tags :

మరిన్ని