- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
News in pics: చిత్రం చెప్పే విశేషాలు (28-06-2024)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 28 Jun 2024 12:51 IST
1/11
2/11
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జానారెడ్డి, పీవీ కుమార్తె వాణిదేవి, కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
3/11
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
4/11
కర్నూలు నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న పి.రంజిత్ బాషా
5/11
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి నారా లోకేశ్
6/11
మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
7/11
శంఖువులు సాధారణంగా ఇసుక ఉండే వాగుల్లో కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం అవి పొలంలోకి వచ్చి చేరాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి వాగు పక్కన పంట పొలంలో వందలాది చిన్న శంఖువులు చేరాయి.
8/11
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామశివారులో ఎన్‌హెచ్-563 కల్వర్టు కురిసిన వర్షానికి కోతకు గురైంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరదనీటికి కల్వర్టు దెబ్బతింది. కల్వర్టులో మట్టి పేరుకుపోయి పై భాగాన పొలాల్లో వరద నీరు నిలిచింది.
9/11
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
10/11
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి జనార్దనాహిల్స్లో, రాయదుర్గం మెట్రో నుంచి సైబర్ టవర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
11/11
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల సందర్భంగా ప్రసాద్ ఐమాక్స్ వద్ద సినిమాలో ఉపయోగించిన బుజ్జి అనే వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్
-
వందేభారత్‌లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు
-
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
-
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా