News in pics: చిత్రం చెప్పే విశేషాలు (26-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 26 Jun 2024 10:35 IST
1/17
శ్రీవారిని ప్రముఖ సినీనటి శ్రీలీల దర్శించుకు న్నారు. ఉదయం  శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో  పాల్గొన్నారు. ఆలయం వెలుపల సినీనటి శ్రీలీల మాట్లాడు తూ..  తనకు రాబిన్‌హుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. 

2/17
సముద్రంలోని రాళ్లు ఉండే ప్రదేశంలో ఆహారం కోసం తిరుగుతూ.. శత్రువులు కనిపిస్తే రాళ్ల మధ్యలో నక్కి వాటికి దొరక్కుండా తప్పించుకుంటుంది. చూడడానికి ఎలుక రంగు, రూపంలో ఉండటంతో దీనిని ఎలుక చేపగా పిలుస్తారని, విశాఖ జిల్లా అచ్యుతాపురం మత్స్యకారులే దీనిని పోటీపడి రూ. 2 వేలకు కొనుగోలు చేశారు. 

3/17
నీలాల నింగి.. వెండి మబ్బుల నీడన శ్రీవారి నిలయం..

4/17
 ‘కల్కి’ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్‌ అభిమానులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి చేశారు. యూత్‌ క్లబ్‌ రోడ్డులో ఉన్న కె కన్వర్షన్‌ హాల్‌ వద్ద 17 కార్లను ‘కల్కి’ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో నిలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

5/17
మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ప్రతి ఇంటి ముందు ఇది సహజంగా కనిపించే చిత్రం.  ఇక్కడి రైతులు ఏళ్లుగా తాము పండించిన నాటు బీరకాయలను విత్తనాల ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. మొదటి పంట వేసిన తరువాత రెండో పంట నుంచి వచ్చే కాయలను విత్తనాల కోసం వదిలివేస్తారు. 

6/17
ఊదా రంగులో కనిపిస్తున్న ఈ పూలను చూసి ఇదేదో పూలతోట అనుకుంటే పొరపడినట్లే. పూత దశలో చిక్కుడు మొక్కలు ఇవి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడ్డిపల్లి నుంచి పార్నపల్లి వెళ్లే రహదారిలో ఓ రైతు పొలంలో చిక్కుడు మొక్కలన్నింటికీ ఒకేసారి పూత రావటంతో ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

7/17
సాధారణంగా ఎక్కువగా నలుపురంగులో ఉన్న కాకులే కనిపిస్తాయి. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో తెలుపు రంగు కాకి దర్శనమిచ్చింది. పార్వతీపురం- శ్రీకాకుళం రహదారిలోని ఎర్రన్న గుడి కూడలిలో ఉన్న ఓ రైస్‌ మిల్లు వద్ద ఓ సిమెంట్‌ స్తంభంపై తింటూ కనిపించింది. 

8/17
వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సులో ప్రస్తుతం నీటిమట్టం తగ్గింది. నీరు లేని ప్రదేశంలో గడ్డి, తుంగ పెరగడంతో పచ్చిక మైదానాన్ని తలపిస్తోంది. పాకాల సందర్శనకు వచ్చే పర్యాటకులు ఆట పాటలతో సందడి చేస్తున్నారు.

9/17
వానాకాలం మొదలు కాగానే తొలకరి జల్లులు కురిశాయి. దీంతో రైతన్నలు పొలాలన్నీ దున్ని విత్తనాలు నాటారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి శివారులోని ఓ రైతు తన పొలంలో సోయా విత్తనాలు వేశారు. కురిసిన కొద్దిపాటి వానకు మొలకెత్తగా తర్వాత వర్షాలు లేకపోవడంతో బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు.

10/17
కరీంనగర్‌ జిల్లా కోతిరాంపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(పోచంపల్లి)లో  సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. విద్యార్థుల మధ్యలో కాసేపు కూర్చొని.. బాగా చదువుకోవాలి.. ఆడుకోవాలని సూచించారు. బాలలతో సరదాగా గడిపారు. 

11/17
మయూరాల నయన మనోహర నడకలు చూపరులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. వానలతో వాతావరణం చల్లగా మారడంతో కొండకోనల్లో విహరించే నెమళ్లు ఉల్లాసంగా తిరగాడటం ప్రారంభించాయి. కర్ణాటకలోని బెళగావి శివార్లలో  కనిపించిన ఓ సుందర దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు కెమేరాలో బంధించాడిలా.. 

12/17
వర్షాలు మొదలవడంతో హైదరాబాద్‌ నగర శివారులో ఈ రైతుకు కూలీలు దొరక్క తన 4 ఎకరాల పంట భూమిలో కూరగాయల సాగుకు కలుపు తీస్తూ కనిపించాడు. 

13/17
గచ్చిబౌలి శంషాబాద్‌ మార్గంలో ఓఆర్‌ఆర్‌పై ఫ్లైయాష్‌తో వెళ్తున్న ఈ టిప్పర్లు వేగంగా వెళ్తుండటంతో ఆ దుమ్మంతా వెనుక వచ్చే వాహనాలపై పడుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. 

14/17
ఎంపీల ప్రమాణానికి హాజరైన సందర్భంగా లోక్‌సభ లాబీలో కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ప్రియాంకా గాంధీ

15/17
ఎంపీల ప్రమాణానికి హాజరైన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనం ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ రఘువీర్, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు రాజీవ్‌శుక్లా, బలరాంనాయక్‌ 

16/17
విజయవాడలో జగన్‌ బస్సు యాత్ర ఉందని  ఐజీఎంసీ మైదానం నీటి ట్యాంకు నుంచి అజిత్‌సింగ్‌నగర్‌ దాకా రోడ్డుకు రెండు వైపులా కొట్టేసిన చెట్లు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నాయి. సరికొత్త హరిత ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రాణం పోసుకుంటున్నాయి.

17/17
రహదారులపై గుంతలను పూడ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ సీపీఎం నాయకులు బురదలో వినూత్న ప్రదర్శన చేశారు.  సీపీఎం విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆకులు కట్టుకొని బురదలో దొర్లుతూ  ప్రదర్శన చేశారు.

మరిన్ని