Malvika Sharma: లాయర్‌+ యాక్టర్‌= మాళవిక శర్మ

‘భీమా’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన మాళవిక శర్మ (Malvika Sharma) ఇప్పుడు ‘హరోం హర’ (Haromhara)తో సందడి చేస్తోంది. సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రమిది. శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా మాళవిక గురించి పలు విశేషాలు..

Updated : 13 Jun 2024 21:38 IST
1/15
ముంబయిలో పుట్టి, పెరిగిన మాళవిక అక్కడే చదువుకుంది. ఎల్‌.ఎల్‌.బి. పూర్తిచేసింది.

2/15
కాలేజీ రోజుల్లోనే మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె నటించిన పలు యాడ్స్‌ సినీ అవకాశాలు తెచ్చిపెట్టాయి. 

3/15
అలా.. తెలుగు సినిమా ‘నేల టికెట్టు’తో 2018లో తెరంగేట్రం చేసింది.

4/15
రవితేజ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో.. తన వ్యక్తిత్వానికి బాగా దగ్గరగా ఉండే పాత్ర పోషించడం ఆనందాన్ని ఇచ్చిందని ఓ సందర్భంలో పేర్కొంది. క్యారెక్టర్‌ పేరు కూడా మాళవికే.

5/15
నటిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ‘రెడ్‌’ ఇచ్చిందని తెలిపింది. రామ్‌ హీరోగా రూపొందిన చిత్రమిది (2021). 

6/15
‘రెడ్‌’లో మహిమగా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ‘కాఫీ విత్‌ కాదల్‌’తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

7/15
గోపీచంద్‌ సరసన ఈ బ్యూటీ నటించిన ‘భీమా’ ఈ ఏడాది మార్చిలో బాక్సాఫీసు ముందుకొచ్చింది.

8/15
మూడు నెలల వ్యవధిలోనే ‘హరోం హర’తో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్‌ ప్లే చేసింది.

9/15
ఓ వైపు నటిస్తూనే మరోవైపు ఎల్‌.ఎల్‌.బి. పూర్తిచేసింది. మల్టీటాస్కింగ్‌ను ఇష్టపడే మాళవిక పార్ట్‌టైమ్‌ లాయర్‌గా పనిచేసింది.

10/15
ఈ ముద్దుగుమ్మకు కథక్‌, పోల్‌ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.

11/15
అభిమాన హీరోలు: అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌ బాబు. వీరితో కలిసి నటించాలనేది ఈ నటి కోరిక.

12/15
ఈ భామకి జంతువుల పెంపకం, ప్రకృతితో గడపడం ఇష్టం.

13/15
గతేడాది.. రాజస్థాన్‌లోని ఓ పాఠశాలను సందర్శించి పేద విద్యార్థులకు చెప్పులు కొనివ్వడమే కాకుండా స్వయంగా వారి పాదాలకు తొడిగి మంచి మనసు చాటుకుంది.

14/15
15/15

మరిన్ని