Krithi Shetty: నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి

‘ఉప్పెన’లో బేబమ్మగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కృతిశెట్టి (Krithi Shetty). ఇప్పుడు ‘మనమే’ (Manamey) చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. శర్వానంద్‌ హీరో. ఈ నెల 7న సినిమా విడుదల సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు చూద్దాం..

Updated : 07 Jun 2024 17:02 IST
1/13
డాక్టర్‌ కావాలనుకుని, యాక్టర్‌ అయిన వారు ఎందరో. ఈ ముద్దుగుమ్మ ఆ జాబితాలోకే వస్తుంది.

2/13
చిన్నప్పటి నుంచీ యాక్టివ్‌గా ఉండే కృతి.. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సెట్‌ వాతావరణాన్ని బాగా ఇష్టపడే ఆమె ఆ తర్వాత సినిమాలపై మక్కువ పెంచుకుంది.

3/13
హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్‌ మూవీ ‘సూపర్‌ 30’లోని ఓ చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. మరోవైపు, ప్రకటనల్లోనూ నటించేది.

4/13
అలా ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌కు రాగా.. ‘ఉప్పెన’లో నటించే అవకాశం దక్కింది. బేబమ్మగా కనిపించి, యువతను బాగా ఆకర్షించింది.

5/13
దాదాపు 18 ఏళ్లకే హీరోయిన్‌గా మెరిసి.. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మోడ్రన్‌ గర్ల్‌గా, ‘బంగార్రాజు’ పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది.

6/13
ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ బ్యూటీ యాక్టింగ్‌ బాగున్నా.. అవి విజయవంతంకాలేదు. ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్డడీ’.. ఇవన్నీ ఫెయిల్యూర్‌ అయ్యాయి.

7/13
ఏడాది తర్వాత తెలుగు ఆడియన్స్‌ ముందుకు వస్తోంది. గ్యాప్‌ ఎందుకొచ్చిందనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ఇవ్వలేదు వచ్చింది’ అని తెలిపింది.

8/13
తమిళ్‌లో మూడు, మలయాళంలో ఓ చిత్రంతో బిజీగా ఉండడంతో టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉన్నట్టు పేర్కొంది. ‘మనమే’లో సుభద్రగా కనిపించనుంది.

9/13
టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే తెలుగుపై పట్టు సాధించింది. పలు ఇంటర్వ్యూల్లో తెలుగులోనే మాట్లాడుతూ ఆకట్టుకుంది.

10/13
‘‘మంచి కథల్ని ఎంపిక చేసుకోవడం తప్ప నా చేతుల్లో ఏమీ ఉండదు. సినిమా విజయానికి నేనొక్కదాన్నే కారణం కాదనే విషయాన్ని తొలి సినిమాతోనే తెలుసుకున్నా’’ అని ఓ సందర్భంలో తెలిపింది.

11/13
సొంతూరు మంగళూరు. ఫ్యామిలీ ముంబయిలో స్థిరపడింది. ప్రస్తుతం సైకాలజీ చదువుతూనే నటిస్తోంది.

12/13
ఒక్క సినిమా చేసి నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంది. కానీ, అప్రయత్నంగానే అవకాశాలు వరుస కట్టడంతో ‘ఇండస్ట్రీని ఎందుకు వదులుకోవాలి’ అనుకొని ముందుకు సాగుతోంది.

13/13
ఈమెకు హీరో రామ్‌చరణ్‌ అంటే అభిమానం. ఆయనతో కలిసి నటించాలనేది కోరిక. ‘‘రాకుమారి పాత్రలంటే ఇష్టం. ‘బాహుబలి’లో అనుష్కలా కనిపించాలని ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కాబోయేవాడు నిజాయతీగా, కలివిడిగా ఉండాలని ఆశిస్తోంది.

మరిన్ని