Neha Shetty: అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి

‘డీజే టిల్లు’లో రాధికగా నటించి, యువకుల మనసులు దోచేసింది హీరోయిన్‌ నేహాశెట్టి (Neha Shetty). ఆమె తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు చూద్దాం..

Updated : 30 May 2024 16:47 IST
1/15
మంగళూరు (కర్ణాటక)కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. బాల్యంలోనే కొన్ని యాడ్స్‌లో నటించింది. ఉన్నత విద్య అభ్యసిస్తూనే మోడలింగ్‌లో శిక్షణ తీసుకుని అందాల పోటీల్లో పాల్గొనేది. 

2/15
‘మిస్‌ మంగళూరు 2014’ విజేతగా, ‘మిస్‌ సౌత్‌ ఇండియా 2015’ రన్నరప్‌గా టైటిళ్లు దక్కించుకుంది. ఇవే ఆమెకు సినీ అవకాశాలు తెచ్చిపెట్టాయి.

3/15
దర్శకుడు శశాంక్‌ కన్నడ చిత్రం ‘ముంగారు మళి 2’ తో ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. 2016లో విడుదలైన ఆ రొమాంటిక్‌ డ్రామా మూవీలో మోడ్రన్‌ అమ్మాయి నందినిగా మెప్పించిందీ బ్యూటీ.

ఆ తర్వాత ‘చాక్లెట్‌ గర్ల్‌’ అనే ప్రైవేట్‌ సాంగ్‌తో హుషారెత్తించింది.
దర్శకుడు శశాంక్‌ కన్నడ చిత్రం ‘ముంగారు మళి 2’ తో ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. 2016లో విడుదలైన ఆ రొమాంటిక్‌ డ్రామా మూవీలో మోడ్రన్‌ అమ్మాయి నందినిగా మెప్పించిందీ బ్యూటీ. ఆ తర్వాత ‘చాక్లెట్‌ గర్ల్‌’ అనే ప్రైవేట్‌ సాంగ్‌తో హుషారెత్తించింది.
4/15
ఈ ముద్దుగుమ్మ ప్రతిభను గుర్తించిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.. ‘మెహబూబా’ (2018)లో అవకాశం ఇచ్చారు. ఆయన తనయుడు ఆకాశ్‌ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది.

5/15
‘మెహబూబా’ నిరాశపరచడంతో సినిమాలకు కొంచెం బ్రేక్‌ ఇచ్చింది. నటనలో మరింత మెరుగుపడేందుకు న్యూయార్క్ ఫిల్మ్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంది.

6/15
2021లో వచ్చిన ‘గల్లీరౌడీ’ కూడా మంచి హిట్‌ ఇవ్వలేకపోయింది. అదే ఏడాదిలో విడుదలైన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో అతిథిగా కనిపించి, అలరించింది. 

7/15
ఈ అందాల భామ కోరుకున్న అసలైన విజయం రాధిక పాత్ర ద్వారా వరించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ‘డీజే టిల్లు’ (2022)లోని ఆ క్యారెక్టర్‌ ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

8/15
‘షారుక్‌ఖాన్‌ని బాద్‌షా అంటే ఎలా ఉంటుందో నన్ను రాధిక అని పిలిస్తే అలానే ఉంటుంది. ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది’ అని ఓ ఇంటర్వ్యూలో ఆనందం వ్యక్తం చేసింది.

9/15
గతేడాది.. ‘బెదురులంక 2012’, ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాలతో సందడి చేసింది. ఇటీవల విడుదలైన ‘టిల్లు స్క్వేర్‌’లో రాధికగా గెస్ట్‌ రోల్‌లో తళుక్కున మెరిసింది.

10/15
‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో పోషించిన పల్లెటూరి అమ్మాయి బుజ్జి పాత్ర.. రాధిక పాత్రలా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని పేర్కొంది. అది పీరియాడికల్‌ మూవీ కాబట్టి అలనాటి హీరోయిన్‌ శోభనను స్ఫూర్తిగా తీసుకుని నటించిందట.

11/15
నటన పరంగానే కాకుండా ఆహార్యం విషయంలో నేహాశెట్టి స్పెషల్‌. ఆమె చీరకట్టుకూ అభిమానులున్నారంటే అతియోశక్తికాదు.

12/15
‘చీరకట్టుతో కనిపించే పాత్రల్నే ఎంచుకుంటున్నానా? అలాంటివే నా వద్దకు వస్తున్నాయా? అని ఆలోచిస్తే... నా దగ్గరికి వస్తున్న పాత్రలే అలా ఉంటున్నాయని అర్థమవుతోంది’ అని ఓ సందర్భంలో నవ్వుతూ చెప్పింది.

13/15
ప్రస్తుతం.. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

14/15
అభిమాన నటులు: అల్లు అర్జున్‌, నయనతార, అనుష్క శెట్టి, శ్రీదేవి. విహారయాత్రలకు వెళ్లడం, గిటార్‌ ప్లే చేయడం బాగా ఇష్టం.

15/15
‘రూల్స్‌ రంజన్‌’లోని ‘సమ్మోహనుడా’ పాటతో తన డ్యాన్స్‌ స్కిల్స్‌ బయటపెట్టి, వావ్ అనిపించుకుంది.

మరిన్ని