Chandini Chowdary: చాందిని డబుల్‌ ధమాకా

తెలుగమ్మాయి చాందినీ చౌదరి (Chandini Chowdary) ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటించిన ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy), ‘యేవమ్‌’ (Yevam) చిత్రాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర సంగతులు చూద్దాం..

Updated : 13 Jun 2024 22:43 IST
1/14
విశాఖపట్నానికి చెందిన ఈ నటి బెంగళూరులో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది.

2/14
‘మధురం’, ‘సాంబార్‌ ఇడ్లీ’ వంటి లఘు చిత్రాల్లో తనలోని యాక్టింగ్‌ టాలెంట్‌ని బయటపెట్టింది. 

3/14
ఆ షార్ట్‌ఫిల్మ్స్‌.. ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ఉపయోగపడ్డాయి. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’లో చిన్న పాత్రలు పోషించింది.

4/14
ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ‘కుందనపు బొమ్మ’కాగా తర్వాత నటించిన ‘కేటుగాడు’ ముందు విడుదలైంది. 

5/14
‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’లతో ఆకట్టుకున్న ఈ తెలుగు అందం ‘కలర్‌ ఫొటో’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

6/14
మళ్లీ ఈమెకు ఆ స్థాయి ప్రశంసలు దక్కింది ‘గామి’ విషయంలోనే. ‘కలర్‌ ఫొటో’ తర్వాత వచ్చిన ‘సూపర్‌ ఓవర్‌’, ‘సమ్మతమే’ తదితర చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

7/14
‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’లో కథానాయకుడిని ప్రోత్సహించే అమ్మాయిగా, ‘యేవమ్‌’లో పోలీస్‌ ఆఫీసర్‌గా విభిన్న పాత్రలు పోషించింది.

8/14
‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’, ‘గాలివాన’, ‘ఝాన్సీ’ తదితర వెబ్‌సిరీస్‌లతో ఓటీటీ ఆడియన్స్‌కూ దగ్గరైంది.

9/14
తనకు కథలు రాయడం ఇష్టమని, సినిమాలకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

10/14
ఇష్టమైన హీరో: రజనీకాంత్‌. ఫేవరెట్‌ డైరెక్టర్‌: మణిరత్నం.

11/14
12/14
13/14
14/14

మరిన్ని