deepika padukone: దీపిక పదుకొణె

వరుస బాలీవుడ్‌ చిత్రాలతో అలరిస్తున్న అందాల కథానాయిక దీపిక పదుకొణె. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 27 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 25 Jun 2024 13:37 IST
1/17
ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ప్రకాశ్‌ పదుకొణె పెద్ద కుమార్తె దీపిక . కోపెన్‌హాగ్‌ (డెన్మార్క్)లో పుట్టిన ఆమె బెంగళూరులో పెరిగారు.

2/17
బాల్యంలోనే వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో.. ఫ్యాషన్‌ మోడల్‌ కావాలని ఒకానొక సమయంలో నిర్ణయించుకున్నారు దీపిక.

3/17
‘చదువును మధ్యలోనే ఆపేసి, మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకోవడంతో.. అమ్మానాన్నను ఎంతమంది విమర్శించినా వారు నన్ను ఒక్కమాట కూడా అనలేదు’ అని చెబుతుంటుంది దీపిక

4/17
బికినీ ధరించి, కింగ్‌ ఫిషర్‌ క్యాలండర్‌కు పోజులివ్వడం అప్పట్లో హాట్‌ టాపిక్‌. సంగీత దర్శకుడు హిమేశ్‌ రేష్మియాతో కలిసి నటించిన ‘నామ్‌ హై తేరా’ మ్యూజిక్‌ వీడియో శ్రోతల్ని విశేషంగా అలరించింది.

5/17
ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’ (2006)తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. అది తెలుగు హిట్‌ మూవీ ‘మన్మథుడు’కు రీమేక్‌

6/17
దీపిక తొలి బాలీవుడ్‌ సినిమా ‘ఓం శాంతి ఓం’ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

7/17
ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘పఠాన్‌’ సైతం మంచి విజయాల్ని అందుకున్నాయి.

8/17
‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ వంటి హిస్టారికల్‌ మూవీస్‌ ఆమెను బాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిపాయి. యాసిడ్‌ దాడి బాధితురాలిగా నటించిన ‘ఛపాక్‌’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

9/17
‘ధమ్‌ మారో ధమ్‌’, ‘బాంబే టాకీస్‌’లాంటి సినిమాల్లోని ప్రత్యేక గీతాలతోనూ ఉర్రూతలూగించారు.

10/17
 ఆంగ్ల చిత్రాలు ‘ఫైండింగ్‌ ఫానీ’, ‘త్రిబుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌’లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

11/17
 దర్శకుడు జయంత్‌ సి. పరాజ్జీ తెరకెక్కించిన ‘లవ్‌ 4 ఎవర్‌’తోనే టాలీవుడ్‌కు హాయ్‌ చెప్పాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అది విడుదల కాలేదు. అందులో దీపిక స్పెషల్‌ సాంగ్‌లో నటించారు.

12/17
మితభాషి. పార్టీలకు దూరంగా ఉంటారు. క్రమం తప్పకుండా యోగా చేస్తారు. నగలపై ఆసక్తి లేదు.

13/17
2023లో.. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ప్రియాంక చోప్రా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయ నటి ఈమే. కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా, ఫిఫా వరల్డ్‌ కఫ్‌ ప్రజెంటర్‌గానూ వ్యవహరించారు.

14/17
2021లో.. ఉత్తమ నటిగా ‘గ్లోబల్‌ అచీవర్స్‌’ పురస్కారం పొందారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే వారికి ఈ అవార్డు ఇస్తారు.

15/17
‘రామ్‌ లీలా’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాల సహనటుడు రణ్‌వీర్‌ సింగ్‌ని వివాహం చేసుకున్నారు. త్వరలో తల్లికాబోతున్నారు.

16/17
17/17

మరిన్ని