Ayesha Khan: అయేషా ఖాన్‌.. డ్యాన్స్‌ చేస్తే ‘మోత మోగిపోద్ది’!

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari)లోని ప్రత్యేక గీతం ‘మోత మోగిపోద్ది’లో నటించి, అందరి దృష్టిని ఆకర్షించింది అయేషా ఖాన్‌ (Ayesha Khan). విష్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా అయేషా గురించి కొన్ని విశేషాలు..

Updated : 30 May 2024 22:02 IST
1/13
ముంబయిలో జన్మించిన ఈమెకు బాల్యం నుంచీ నటనపై ఆసక్తి. దీంతో, చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయింది. 

2/13
14 ఏళ్ల వయసులో మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. 17 ఏళ్లకు నటనపై దృష్టి పెట్టింది.

3/13
అలా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌కి పని చేసింది. ‘బాలవీర్‌ రిటర్న్స్‌’ సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది. 

4/13
ధారావాహికల్లో నటించిన అనుభవంతో సినిమాల్లో అవకాశం అందుకుంది.

5/13
‘ముఖచిత్రం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  హీరోని అమితంగా ప్రేమించే అమ్మాయి మాయా ఫెర్నాండెజ్‌గా ఆకట్టుకుని, తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. 

6/13
‘ఓం భీమ్‌ బుష్‌’లో రత్తాలుగా కనిపించి, యువతను ఆకర్షించింది. 

7/13
‘మోత మోగిపోద్ది’ (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి) పాటతో తనలోనూ మంచి డ్యాన్సర్‌ ఉందని తెలియజేసింది.

8/13
‘లక్కీ భాస్కర్‌’ సినిమాలోనూ ఈ బ్యూటీ భాగమైంది. ఏదైనా కీలక పాత్ర పోషిస్తుందా? ప్రత్యేక గీతంలో నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 

9/13
‘మోత మోగిపోద్ది’ అంటూ...
‘మోత మోగిపోద్ది’ అంటూ...
10/13
‘బిగ్‌బాస్‌’ (హిందీ) కంటెస్టెంట్‌గానూ ఈమె పాపులర్‌. సీజన్‌ 17లో పాల్గొని, సందడి చేసింది.

11/13
12/13
13/13
దర్శకుడు రాజమౌళితో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇది ఫొటో మాత్రమే కాదు ఓ ఎమోషన్‌’ అని పేర్కొంది. 

మరిన్ని