News in pics: చిత్రం చెప్పే విశేషాలు (05-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 05 Jul 2024 03:50 IST
1/10
ఆదిలాబాద్‌: నేరడిగొండ మండలం కొర్టికల్‌ గ్రామ సమీపంలోని జలపాతం పాలనురగల జలధారతో కనువిందు చేస్తోంది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ జలపాత అందాలను ఆస్వాదిస్తూ వాహనదారులు, ప్రకృతి ప్రేమికులు మంత్రముగ్ధులవుతున్నారు.

2/10
కరీంనగర్‌: యాసంగి సీజన్‌లో పంట కోత సమయంలో కిందపడిన ధాన్యం గింజలు ఇటీవల కురిసిన వర్షానికి మొలకెత్తగా, వరి పొలాన్ని తలపిస్తోంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం శివారు రైతు పొలమిది.

3/10
అమరావతి: అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో క్షత్రియ కార్పొరేషన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

4/10
అనంతపురం: రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ స్థాయి లలితకళల పోటీల్లో భాగంగా పలువురు చిన్నారులు సంధ్యశ్రీ, హర్షిత, సాయిచరిత, తేజస్విని భరత తమ నాట్య ప్రదర్శనతో అందర్నీ అలరించారు.

5/10
విశాఖపట్నం: నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలకు గురువారం సాయంత్రం కొన్ని కొత్త నేస్తాలు వచ్చాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా గ్రీన్‌ వింగ్‌ మకావ్, స్క్విరెల్‌ మంకీస్‌ తదితర వాటిని తీసుకువచ్చినట్లు ఇన్‌ఛార్జి క్యూరేటర్‌ మంగమ్మ తెలిపారు.

6/10
నిజామాబాద్‌: కష్టపడితే రాళ్ల భూమిలో రతనాలు పండించవచ్చని పెద్దలు అనే మాటలకి ఈ చిత్రాలే నిదర్శనం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వెళ్లే మార్గంలో ఎత్తయిన గుట్టలున్నాయి. ఈ గుట్టల పక్కన తండాల్లోని గిరిజనులు వర్షపు నీరే ఆధారంగా గుట్టలపై మొక్కజొన్న పంటను పండిస్తారు.

7/10
జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో గురువారం మాసశివరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు.. భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. శ్రీకాకుళం నగరం గుడివీధిలోని ఉమారుద్ర కోటేశ్వరాలయం, నక్కవీధిలో ఉమాజఠలేశ్వరాలయాలు భక్తులతో కళకళలాడాయి.

8/10
మెదక్‌: సంగారెడ్డి పట్టణంలోని భవాని భువనేశ్వరి ఆలయ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

9/10
ఖమ్మం: వైరా పురపాలక సంఘం పరిధి తొమ్మిదో వార్డు లీలాసుందరయ్యనగర్‌లో అమీన్‌కు చెందిన ఓ ఇంటి ఆవరణలో ఉన్న పూలమొక్క ఇది. టెక్సాస్‌ సేజ్‌ అనే రకానికి చెందిన మొక్కకు ఆకుల కంటే ఎక్కువగా ఇలా పూలు విరబూసి చూడముచ్చటగా కనిపిస్తున్న దృశ్యమిది.

10/10
గతంలో గ్రామాల్లో రైతులు పండించిన తిండి గింజలను గుమ్మీల్లో నిల్వ చేసుకొని.. ఆ తర్వాత వినియోగించుకునేవారు. అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో అవి కనుమరుగవుతున్నాయి. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలం గట్టుమీది తండాలో కనిపించింది ఈ దృశ్యం.

Tags :

మరిన్ని