News in pics: చిత్రం చెప్పే విశేషాలు (04-07-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 04 Jul 2024 04:03 IST
1/10
చిత్తూరు: భాకరాపేట మార్గంలో రంగంపేటకు సమీపంలో రహదారికి ఇరువైపులా ఉన్న దశాబ్దాల నాటి చింతచెట్లు ఇవి. ఇటీవల కురిసిన వర్షాలకు చిగురించి పచ్చదనం సంతరించుకుని నయనానందకరంగా కనిపిస్తున్నాయి.

2/10
హైదరాబాద్‌: వికారాబాద్‌ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు వానచినుకు తాకితే చాలు పచ్చందాల సిరులతో కనువిందు చేస్తున్నాయి. తాజాగా కురిసిన వర్షాలతో కనుచూపు మేర పచ్చదనం పరుచుకుంది.

3/10
ఖమ్మం నగరంలో పార్కులను అధికారులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గోళ్లపాడు ఛానల్‌లోని మంచికంటి రామకృష్ణారావు పార్కులో జారుడు బండలను చిన్నారులు ఆకట్టుకునేలా తయారుచేశారు.

4/10
తూర్పుగోదావరి: ఇటీవల ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో సందడిచేసిన ‘బుజ్జి’ వాహనమిది. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం ఆవరణలోని సుబ్రహ్మణ్య మైదానానికి బుధవారం తీసుకురావడంతో నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వీయచిత్రాలు తీసుకున్నారు.

5/10
కరీంనగర్‌: గ్రామానికి వెళ్లే రహదారి వెంట తాటి చెట్లు స్వాగతం పలుకుతూ కనువిందు చేస్తున్నాయి. బీర్‌పూర్‌ మండలంలోని రేకులపల్లె గ్రామానికి వెళ్లే రహదారికి ఇరువైపులా దాదాపు కి.మీ పొడవునా తాటి చెట్లు వరుస క్రమంలో ఉన్నాయి.

6/10
ఏలూరు: గోదావరిలో ఎటుచూసినా ఇసుకతిన్నెలే కనిపించేవి. నేడు వరదనీరు పోటెత్తడంతో జలకళ సంతరించుకుంది. పోలవరం స్పిల్వే లోపలి భాగంలో పక్షం రోజుల క్రితం నాటి పరిస్థితి మొదటి చిత్రంలోనిది. నేడు జలకళ సంతరించుకున్న చిత్రం రెండోది.

7/10
పంటలు ఏపుగా పెరుగుతుండటంతో ఎద్దులకు డిమాండ్‌ పెరిగింది. నల్గొండ మండలం దోనకల్‌లో అద్దెకు పత్తిలో గుంటుక తోలుతున్న దృశ్యం ‘ న్యూస్‌టుడే’ కంటపడింది. గుంటుక కోసం ఎడ్లను తెచ్చిన వ్యక్తికి రూ.రెండు వేలు చెల్లించానని రైతు వెంకన్న తెలిపారు.

8/10
విశాఖపట్నం: ఈ చిత్రంలో కనిపిస్తున్న సీతాకోకచిలుక అక్కడి గోడపై ఉన్న రంగులో కలిసిపోయింది. సీతాకోకచిలుకలు పరిస్థితులకు అనుగుణంగా తన బాహ్య రూపాన్ని మార్చుకోగల స్వభావాన్ని కలిగి ఉంటాయని కీటక విభాగం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

9/10
వరంగల్‌: పబ్లిక్‌ కుళాయికి చుట్టూ గద్దె నిర్మాణానికి గిరిజన తండావాసులు వినూత్నంగా ఆలోచించారు. ఓ టైరును కుళాయి మధ్యలో అమర్చి అందులో సిమెంటు కాంక్రీటు నింపారు. డోర్నకల్‌ మండలం లకావతు తండాలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.

10/10
హైదరాబాద్‌: ఇటీవల కురిసిన వర్షాలకు పబ్లిక్‌ గార్డెన్‌లోని చెరువులో భారీగా నీరు చేరింది. పైన నాచు పేరుకుపోవడంతో ఇలా మైదానంలా కనిపిస్తోంది.

Tags :

మరిన్ని