News in pics: చిత్రం చెప్పే విశేషాలు (25-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 25 Jun 2024 21:02 IST
1/6
హైదరాబాద్‌: విజయవాడ హైవేలోని ఆటోనగర్‌ మలుపులో సోమవారం సాయంత్రం సంధ్య వేళ సూరీడు అస్తమిస్తూ కనువిందు చేశాడు. రోడ్డుకు ఎదురుగా కిందికి జారిపోతున్నట్లు కనిపించాడు. అస్తమిస్తున్న సూర్యుడు సూటిగా చూసేందుకు వీలుగా పసుపు నారింజ రంగులు మేళవించుకొని అబ్బురపరిచాడు.

2/6
హైదరాబాద్‌: మొయినాబాద్‌లో తయారైన విమానాన్ని రెస్టారెంటుగా మార్చుతున్నారు. బ్రిటన్‌ సహకారంతో తయారైన ఈ విమానం మొదటి, రెండో ప్రపంచ యుద్దాల్లో పాల్గొన్న బాంబర్లలో ఒకటని నిర్వాహకులు తెలిపారు.

3/6
నెల్లూరు: నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు రథోత్సవం సోమవారం రాత్రి కమనీయంగా సాగింది. వడ్డిపాలెంలోని పుట్టింటి నుంచి ప్రారంభమై.. స్నేహితురాలైన తుమ్మల పెద వెంగమ్మ, అత్తమామల ఇళ్ల మీదుగా సుగాలీల వీరతాండవం, చిన్నారుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

4/6
నెల్లూరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గంగపట్నం చాముండేశ్వరీదేవికి కనుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు. అమ్మవారు విశేషాలంకరణలో తెప్పపై కొలువుదీరి విహరిస్తూ.. భక్తులకు అభయమిచ్చారు.

5/6
వరంగల్‌: సాధారణంగా ఈత చెట్లు వేర్లు భూమి లోపల ఉంటాయి. కాని.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని ముసలమ్మ జాతర పరిసరాల ప్రాంతంలో ఉన్న ఈత చెట్టు ఇలా వేర్లు బయట ఉండడంతో భక్తులు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.

6/6
విశాఖపట్నం: తమ బడికి భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ డొంకపుట్టు పాఠశాల విద్యార్థులు కోరారు. సోమవారం పాఠశాలలో విద్యార్థులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.

Tags :

మరిన్ని