News in pics: చిత్రం చెప్పే విశేషాలు (24-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 24 Jun 2024 03:35 IST
1/12
విశాఖపట్నం: బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన యువతుల ర్యాంప్‌వాక్‌ ఆకట్టుకుంది. బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన పలువురు మోడల్స్‌ ఇందులో పాల్గొన్నారు.

2/12
విశాఖపట్నం: సముద్రం వెనక్కి మళ్లడంతో ఆర్కే బీచ్‌లో ఆదివారం అలల తాకిడి తగ్గింది. బండరాళ్లు పైకి తేలాయి. ఇవి బాగా నాచుపట్టి పచ్చగా ఉండటంతో పిల్లలు, పెద్దలు వీటిపైకి చేరి ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. అవే ఈ దృశ్యాలు.

3/12
తూర్పుగోదావరి: సంప్రదాయ సంగీతం, నృత్యం అంశాల్లో రాజమహేంద్రవరం ఆనంకళా కేంద్రంలో జరుగుతున్న అంతర్జాతీయ కళా సమ్మేళన్‌లో వివిధ ప్రాంతాల నుంచి హాజరైన చిన్నారులు ప్రతిభ కనబరిచారు.

4/12
అమరావతి: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన గ్రాండ్‌ మ్యూజికల్‌ అండ్‌ మల్టీటాలెంట్‌ షో ఆహూతులను అలరించింది. ‘కళాంజలి’ సంస్థకు సంబంధించిన పిల్లల, మహిళల ఫ్యాషన్, పార్టీ వేర్‌ డ్రెస్‌లతో చిన్నారులు, యువతులు సందడి చేశారు.

5/12
నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ మండలం ఘన్‌పూర్‌ నుంచి బోధన్‌ వెళ్లే దారి అంతా పూలదారిగా మారింది. ఇటీవల కురిసిన వానలకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు ఎర్రటిపూలు నిండుగా పూశాయి. ఈ దారి మీదుగా వెళ్తున్న ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది.

6/12
హైదరాబాద్‌: కళకు ప్రాంతం, భాష బేధాలుండవు..రాజస్థాన్‌ కళాకారులు... నిమ్మ, జామ, మామిడి లాంటి చెట్ల కర్రలకు ఆకృతినిచ్చి అందమైన రూపాన్నిచ్చారు. అవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

7/12
హైదరాబాద్‌: పల్లె అందాలతో అలరిస్తున్న శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కళాకారులు చూడముచ్చటైన శాస్త్రీయ నృత్యప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రదర్శించిన భరతనాట్య నృత్యాంశాలు కళాప్రియులను కట్టిపడేశాయి.

8/12
నెల్లూరు: దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి నిలుపు కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక వాహనంలో పేరంటాలు అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకువచ్చి ఆలయ పండితులచేత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

9/12
వరంగల్‌: చారిత్రక కట్టడాలున్న ఖిలావరంగల్‌కోటలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. వాతావరణం మేఘావృతమై ఆహ్లాదకరంగా ఉండటంతో ఫొటోలు దిగారు.

10/12
మెదక్‌: చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌ రోడ్డులో మొక్కజొన్న విత్తనాలను పొలంలో నాటడానికి రైతులు యంత్రాలను వాడుతున్నారు. సులభంగా విత్తుకోగలుగుతున్నామని, త్వరగా పని పూర్తవుతోందని రైతులు చెప్పారు.

11/12
మహబూబ్‌నగర్‌:  పక్షుల నుంచి వరినారును కాపాడుకోడానికి రైతులు చేసిన ఉపాయమిది. మడి చుట్టూ కర్రలు పాతి దారానికి తోరణాల వలె ప్లాస్టిక్‌ కవర్లు కడుతున్నారు. మక్తల్‌ మండలం అంకెన్‌పల్లి, అనుగొండ గ్రామాల నడుమ జూరాల వెనక జలాల పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో కనిపించిన దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది.

12/12
హైదరాబాద్‌: ఒలింపిక్‌ డే సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్‌కు చెందిన ఓ కళాశాల, పాఠశాల విద్యార్థులు టార్చ్‌ పట్టుకొని ఎల్బీ స్టేడియం వైపు ఉత్సాహంగా పరుగు తీశారు.

Tags :

మరిన్ని