News in pics: చిత్రం చెప్పే విశేషాలు (23-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 23 Jun 2024 14:15 IST
1/23
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసి ఠాణాలకు తరలిస్తున్న పోలీసులు

2/23
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

3/23
కరీంనగర్‌లోని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

4/23
కరీంనగర్‌లోని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు

5/23
భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్ తలుపులు మూసేసి భారీగా  పోలీసులు మోహరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్ తలుపులు మూసేసి భారీగా పోలీసులు మోహరించారు.
6/23
హనుమకొండ సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ప్రాంతంలో రోడ్డుకు ఆనుకొని చెట్టు పూర్తిగా ఎండిపోయింది. ఈదురు గాలులకు కొమ్మలు విరిగి పడుతున్నాయి. వర్షాకాలం మొదలు కావడంతో చెట్టు కూలి రోడ్డు వైపు పడే ప్రమాదం ఉండడంతో వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

7/23
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరిస్తున్న బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ. చిత్రంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు

8/23
హైదరాబాద్‌లోని జలమండలి డివిజన్‌-3 పరిధిలో లక్ష్మీ నగర్‌ నుంచి గుడిమల్కాపూర్‌ వెళ్లే దారిలో తాగునీటి పైప్‌ లైన్‌ లీకైంది. పరిసరాల్లోని నివాసితులు వచ్చి ఆ నీటిని  బిందెల్లోకి వడకట్టుకుని పట్టుకున్నారిలా..

9/23
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ ఇందిరా పార్కు మార్గంలో చాలా మంది వస్తుంటారు.. అక్కడే మంచినీటి పైప్‌లైన్‌ వాల్వ్‌ లీక్‌ కావడంతో భారీగా నీరు వృథాగా పోతోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

10/23
హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఆకాశం శనివారం సాయంత్రం నీలి మబ్బులతో నిండిపోయింది.  ఆ మసక చీకటిలో ఓ మహిళ చేతిలోని మిరుమిట్లు గొలిపే బుడగలు కనువిందు చేశాయి.

11/23
ఖమ్మం: చింతకాని మండలం వందనం రహదారి వెంట వందలాది చెట్లు నిండుగా పుష్పాలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. కొందరు వాహనచోదకులు చెట్ల నీడన కాసేపు సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.

12/23
హైదరాబాద్‌: శివారుల్లో పూల తోటలు కనుమరుగవుతున్నాయి. కానీ శ్రీశైలం జాతీయ రహదారి నుంచి మహేశ్వరం వెళ్లే దారిలో పూల తోటలు అధికంగా ఉన్నాయి. ఇవి రైతులకు ఆదాయంతోపాటు ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి.

13/23
చిత్తూరు: ఎస్వీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక భువన విజయం ఆడిటోరియంలో శనివారం రాత్రి కళాంజలి ఫ్యాషన్‌ షో జరిగింది. వైద్య విద్యార్థులు కళాంజలి వస్త్రాలు ధరించి ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు.

14/23
కర్నూలు: ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్‌లో శనివారం సాయంత్రం ఏరువాక పౌర్ణమిని యువకులు వినూత్నంగా నిర్వహించారు. వృషభాల ఊరేగింపుతోపాటు సినీ నటులు అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రపటాలను ఊరేగించారు.

15/23
అనంతపురం: తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో శనివారం ‘సంధ్యా రవళి’ పేరుతో శ్రీ నృత్యకళానిలయం వ్యవస్థాపకురాలు, నృత్య శిక్షకురాలు సంధ్యామూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.

16/23
హైదరాబాద్‌: కళాభూమి సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి సుందరయ్య కళానిలయంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు కళాకారులు చక్కటి హావభావాలతో, చూడముచ్చటగా నృత్యాలను ప్రదర్శించారు.

17/23
ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర తుల్జాపూర్‌లో ఉన్న విగ్రహం మాదిరిగా దీనిని తయారు చేయించారు.ఇలాంటి విగ్రహ నమూనా నిజామాబాద్‌ జిల్లాలో ఎక్కడా లేదని గ్రామస్థులు చెప్పారు.

18/23
ఆదిలాబాద్‌: ఆరుద్ర కార్తె రాగానే.. ఎర్రని పట్టు వస్త్రాన్ని కప్పుకొన్నట్లుగా కనిపించే ఈ పురుగులు కేవలం ఈ కార్తెలోనే కనిపిస్తాయి. పెంచికల్‌పేట్‌ మండలంలోని బొంబాయిగూడ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఇలా గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.

19/23
చిత్తూరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి శనివారం ఉదయం శ్రీ శ్రీకోదండరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పరిచారకులు భక్తులపై చల్లుతూ వసంతోత్సవం నిర్వహించారు.

20/23
నెల్లూరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శనివారం లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల కల్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. తిలకించారు. రాత్రి తిరుచ్చి ఉత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండువగా సాగింది.

21/23
హైదరాబాద్‌: జేష్ఠ పౌర్ణమి సందర్భంగా బంజారాహిల్స్‌ జగన్నాథుడు గజానన రూపంలో శనివారం దర్శనమిచ్చాడు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.  దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు.

22/23
మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో శనివారం ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. కొందరు రైతులు ఎడ్లను అందంగా అలంకరించి దేవాలయాల ఆవరణలో ప్రదక్షిణలు చేయించారు.

23/23
హైదరాబాద్‌: నగరంలోని గౌలిపుర డివిజన్‌ హనుమాన్‌నగర్‌లో ఓ సెల్‌టవర్‌ను పచ్చని తీగలు ఇలా చుట్టేశాయి. ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

Tags :

మరిన్ని