News in pics: చిత్రం చెప్పే విశేషాలు (22-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 22 Jun 2024 09:52 IST
1/15
యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పల్లగట్టుతండాలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం పన్నెండేళ్ల కిత్రం సర్కారు బడి. పిల్లలు లేక మూత పడటంతో ఆ బడిని గ్రామ పంచాయతీగా మార్చారు. ఓ వైపు పంచాయతీ కార్యదర్శి గ్రామ పాలన సాగిస్తుండగా,  బడి బాట కార్యక్రమంలో  భాగంగా అదే గదిలో విద్యార్థులకు బోధన నిర్వహిస్తున్నారు. 

2/15
ఫ్రాన్స్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్, తోబియాన్‌ హైపర్‌-జీటీ హైబ్రిడ్‌ కారును ఆవిష్కరించింది. 40 మిలియన్‌ డాలర్ల (సుంకాలు కాకుండా సుమారు రూ.34 కోట్ల) ధర పలికే ఈ అత్యాధునిక కారుకు 8.3 లీటర్‌ వీ16 ఇంజిన్‌ అమర్చారు.

3/15
గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం శ్రీసీతారామస్వామి వారి దేవస్థానంలో జ్యేష్టాభిషేక మహోత్సవంలో భాగంగా స్వామివారికి పుష్పయాగం నేత్రపర్వంగా  నిర్వహించారు. స్వామివారికి  పుష్పాలతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది.

4/15
కాకినాడ నగర శివారులో ఉన్న ప్రాంతాల ప్రజలు తాగునీటికి తిప్పలుపడుతున్నారు. ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ ప్రాంతం, డ్రైవర్స్‌ కాలనీ, పగడాల పేట తదితర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కేవలం ఒక్క ట్యాంకర్‌ మాత్రమే వస్తుండటంతో నీటి కోసం ఎగబడుతున్నారు.

5/15
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరి రోజున ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్పస్వామి వారు బంగారు కవచంలో పునఃదర్శనమిచ్చారు. 

6/15
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. దేవాలయాల్లో శుక్రవారం దేవతామూర్తులకు అభిషేకం, విశేష అలంకరణ పూజలు నిర్వహించారు. బలగ కాలభైరవాలయంలో  బాలత్రిపుర సుందరి అమ్మవారికి   అభిషేకం చేశారు.

7/15
మంచు కొండల్లో యోగాసనాలు వేస్తున్న సైనికులు

8/15
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుర్రాలపై ఎన్‌సీసీ విద్యార్థులు యోగాసనాలు వేశారు. గన్నవరం మండలం కేసరపల్లి ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల ఆవరణలోని 3(ఏ), ఆర్వీ ఎన్‌సీసీ జేసీవో సుందర్‌సింగ్, ఏ.ఎన్‌.ఓ డాక్టర్‌ జయబాల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఈ ఆసనాలు వేశారు. 

9/15
శాసనసభలో కొలువుదీరిన సభ్యులు. చిత్రంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు

10/15
శాసనసభలోకి అడుగుపెట్టే ముందు నేలకు మొక్కుతున్న సీఎం చంద్రబాబు

11/15
సభలో ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్, రామానాయుడు, ఎమ్మెల్యేలు

12/15
నరసాపురం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌  అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా కనిపించారు. ఆయన మత్స్యకారుడి వేషధారణలో వల, చేపల బుట్ట పట్టుకుని కూడలి నుంచి అసెంబ్లీ ప్రవేశద్వారం వరకు నడుచుకుంటూ వచ్చారు

13/15
కృష్ణా వెనుక జలాలు భారీగా తగ్గుముఖం పట్టడంతో వైజాగ్‌కాలనీ, గువ్వలగుట్ట, కాచరాజుపల్లి, బుగ్గతండా వాసులకు చేపల వేట కరవైంది. దీంతో జీవనోపాధి కోసం ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికుల కోసం బోట్లు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 

14/15
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి అమ్మకందారులు, కొనుగోలుదారులు పెద్దఎత్తున తరలివస్తారు. సంత జరుగుతుండగా, ఎక్కడి నుంచో కొండముచ్చు కూరగాయలు విక్రయించే చోటుకు వచ్చి దర్జాగా కూర్చుంది. 

15/15
ఏరువాక పౌర్ణమి వేడుకలను  సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, రామాపురం, చింతలపాలెం గ్రామాల్లో రైతులు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. అరక దున్నే ఎద్దులను అలంకరించి, మేళతాళాలతో ముందుకు కదిలారు. 

మరిన్ని