News in pics: చిత్రం చెప్పే విశేషాలు (29-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 29 Jun 2024 14:46 IST
1/23
ఉమ్మడి వరంగల్‌ జిల్లా  గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న మంత్రి కొండా సురేఖ,  సీఎస్‌ శాంతికుమారి తదితరులు

2/23
వనమహోత్సవంలో భాగంగా వరంగల్‌ టెక్స్‌టైల్‌  పార్క్‌లో మొక్కలు నాటిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి తదితరులు

3/23
గిరిజన రిజర్వేషన్ల సాధన సమితి  ఆధ్వర్యంలో గన్‌పార్కులో ఓయూ విద్యార్థి మోతీలాల్‌కు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్న నాయకులు , కార్యకర్తలు

4/23
దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  అరెస్టును వ్యతిరేకిస్తూ  ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న ఆప్‌ నాయకులు

5/23
దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  అరెస్టును వ్యతిరేకిస్తూ  నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన ఆప్‌ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

6/23
ఆప్‌ నాయకులను ఠాణాలకు తరలిస్తున్న పోలీసులు

7/23
ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ అనుబంధ సంస్థ వాల్తేరు సొసైటీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్‌ ఫొటో జర్నలిస్టుల బృందం లంబసింగి, తాజంగి, చెరువులవెనం, చింతపల్లి ప్రాంతాల్లో పర్యటించింది. ఇక్కడి సహజసిద్ధ అందాలను వారు తమ అధునాతన కెమెరాల్లో బంధించారు. 

8/23
విశాఖ జిల్లాలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దశాబ్దాల నాటి మామిడి చెట్టు విరగకాసింది. గుత్తులు గుత్తులుగా కాసి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చెట్టు ఏడాదికి సుమారుగా 3000 కాయల వరకు కాస్తుందని స్థానికులు చెబుతున్నారు. 

9/23
వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర తీరం అల్లకల్లోలంగా మారింది. గత రెండు రోజులుగా సముద్రం ఉద్ధృతంగా మారడంతో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మరింతగా తీవ్రమయ్యాయి.  సమీప తోటల వరకు అలలు చొచ్చుకొస్తున్నాయి. 

10/23
కర్నూలు మండలం తులశాపురానికి చెందిన లక్ష్మన్న కుమారులు కాడెద్దులుగా మారి పొలం దుక్కిదున్నే పనులు చేస్తున్నారు. దుక్కి దున్నేందుకు కూలీ రూ.వెయ్యి చెల్లించలేక కొడుకులు ముందువైపు లాగుతుండగా..  ఆముదాల పంటలో దుక్కి దున్నుతున్నట్లు తెలిపారు.

11/23
ప్రముఖ కథానాయకుడు  నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం చిత్రీకరణ కర్నూలులోని  ఓర్వకల్లు రాక్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో జరుగుతోంది. ఆదోని పట్టణానికి చెందిన నందమూరి యువసేన సేవా సంస్థ అధ్యక్షుడు సజ్జాద్‌ తన భార్య, కొడుకుతో బాలకృష్ణను కలిశారు. బాలయ్య వారి కలిసి భోజనం చేశారు. 

12/23
టీ 20 క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో  భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. పోటీల్లో భారత్‌ విజయం సాధించాలని కోరుతూ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, కార్పెంటర్‌ దార్ల రవి చెక్కతో 3 గంటల్లో పొట్టికప్పు నమూనాను తయారు చేశాడు.

13/23
విశాఖ జిల్లా అరకు సంతబయలులోని సంత ప్రాంగణం వర్షంతో బురదమయంగా తయారైంది. అడుగేసి తీయలేని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల దుకాణాలకు చేరుకోవడానికి గిరిజనులు అష్టకష్టాలు పడ్డారు. ఏటా వర్షాలతో ఈ ప్రాంతం బురదమయంగా మారుతోంది. 

14/23
విజయవాడ చుట్టుగుంటకు చెందిన రమణ.. విజయనగరం జిల్లాలో 2023 అక్టోబరులో పలాస, రాయగడ ప్యాసింజరు రైళ్లు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.  ప్రభుత్వం, రైల్వే అధికారులు ఎలాంటి సాయం, పరిహారం అందించలేదని, రైల్వే అధికారులన్ని అడిగితే కోర్టును ఆశ్రయించాలని చెప్పారని రమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

15/23
నల్గొండ జిల్లా  సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని డాకుతండాకు వెళ్లే రహదారి ఇది. గతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు  ఏపుగా పెరిగాయి. రోడ్డుకు ఇరువైపులా పచ్చని తోరణంగా ఉన్న వాటిని చూసి వాహన చోదకులు పులకరించి పోతున్నారు.  

16/23
నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్‌ వెళ్లే ప్రధాన రహదారి పక్కన బోర్గాం(కె) మూలమలపు వద్ద రెండు పాడైన సిమెంట్‌ పైపులున్నాయి. వాటిలో ఒకదాన్ని తన ఇల్లుగా మార్చుకొని జీవిస్తుంది ఈ వృద్ధురాలు.  భర్త చనిపోయారని,  నా అనేవారు ఎవరూ లేరని, ఉండటానికి ఇల్లు సైతం లేదని ఆమె పేర్కొన్నారు. దాతలు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తోంది. 

17/23
అడుగు ఎత్తులో.. చాట వెడల్పున ఎదిగిన ఓ పుట్టగొడుగు ఎంతగానో ఆకట్టుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం  వీరునాయక్‌తండా సమీపంలోని అడవిలో పెరిగిన ఈ పుట్టగొడుగు శ్వేత వర్ణంలో మెరిసిపోతోంది. 

18/23
కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండు వెనుక ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడి పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. సాయంత్రం తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నంకాగా, పిల్లలు ఒక దగ్గరకు చేరి ఇలా చదువుకుంటూ కనిపించారు. వారిని ‘ఈనాడు’ పలకరించగా.. మంచిగా చదువుకొని.. బాగు పడతామని చెప్పడం విశేషం. 

19/23
హైదరాబాద్‌.. కీసరగుట్టలోని కొలనులో తామర(కమలం) పువ్వులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు తెల్ల తామర పూలు,   మరోవైపు చెరువు కట్టపై ఎర్ర పూలు ఆహ్లాదం పంచుతున్నాయి. 

20/23
హైదరాబాద్‌ నగరంలోని పలుచోట్ల  వర్షం కురిసింది. ఫైఓవర్లు పైనుంచి రోడ్డు మీదకు వాన నీరు జలపాతంలా కిందకు పారింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45లోని ఆకాశవంతెన వద్ద కనిపించిందీ చిత్రమిది.

21/23
గత విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు  తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌  బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు.  చెన్నై తిరువాన్మియూర్‌లో జరిగిన కార్యక్రమంలో 21 జిల్లాలకు చెందిన 800 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు

22/23
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి  సందర్శించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

23/23
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్‌ కోబ్రా) హల్‌చల్‌ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. సమాచారం అందుకున్న విశాఖలోని వన్యప్రాణుల సంరక్షణ సమితి  సభ్యులు గిరినాగును పట్టుకొని, అటవీ ప్రాంతంలో వదిలేశారు.

మరిన్ని