News in pics: చిత్రం చెప్పే విశేషాలు (28-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 28 Jun 2024 12:51 IST
1/11
2/11
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని  పీవీ ఘాట్‌ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌, జానారెడ్డి, పీవీ కుమార్తె వాణిదేవి, కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌, జానారెడ్డి, పీవీ కుమార్తె వాణిదేవి, కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
3/11
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
4/11
కర్నూలు నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న  పి.రంజిత్ బాషా

5/11
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి నారా లోకేశ్‌

6/11
మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో  సమీక్ష నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

7/11
శంఖువులు సాధారణంగా ఇసుక ఉండే వాగుల్లో కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం అవి పొలంలోకి వచ్చి చేరాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి వాగు పక్కన పంట పొలంలో వందలాది చిన్న శంఖువులు చేరాయి. 

8/11
కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామశివారులో ఎన్‌హెచ్‌-563 కల్వర్టు కురిసిన వర్షానికి కోతకు గురైంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరదనీటికి కల్వర్టు దెబ్బతింది. కల్వర్టులో మట్టి పేరుకుపోయి పై భాగాన పొలాల్లో వరద నీరు నిలిచింది. 

9/11
హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో  వర్షం కుండపోతగా కురిసింది.  రహదారులపై నీరు నిలవడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

10/11
హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో  వర్షం కుండపోతగా కురిసింది.  రహదారులపై నీరు నిలవడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి జనార్దనాహిల్స్‌లో, రాయదుర్గం మెట్రో నుంచి సైబర్‌ టవర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

11/11
ప్రభాస్‌ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల సందర్భంగా  ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సినిమాలో  ఉపయోగించిన   బుజ్జి అనే వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు.

మరిన్ని