News in pics: చిత్రం చెప్పే విశేషాలు (24-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 24 Jun 2024 14:39 IST
1/16
తిరుపతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ మీకోసం -ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ధ్యానచంద్ర

2/16

తిరుపతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ‘ మీకోసం -ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజలు

3/16
నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు స్వాగతం పలికిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

4/16
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, నాయకులు

5/16
సోమాజిగూడలోని ఓ హోటల్‌ నిర్వహించిన ఎఫ్‌ఐసీసీఐ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌ బాబు

6/16
 సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో నిరవధిక సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్లు

7/16
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ డాక్టర్లు

8/16
నవాబ్‌పేట :ఈసారి ఖరీఫ్‌లో మృగశిర కార్తెలోనే తొలకరి పలకరించడంతో అన్నదాతలు రెట్టింపు ఉత్సాహంతో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పత్తి, కంది, మొక్కజొన్న ఇతర పంటలు రెండాకుల దశలో ఉన్నాయి. దాదాపు పది రోజులుగా వరుణదేవుడు ముఖం చాటేయడంతో నేల నెర్రెలిస్తోంది.

9/16
తాండూరు మండలంలోని 44 ప్రభుత్వ పాఠశాలలకు రూర్బన్‌ పథకం ద్వారా వంట గ్యాస్‌ పొయ్యిలను సరఫరా చేశారు. సగానికిపైగా పాఠశాలల్లో పొయ్యిలు మూలకు చేరాయి. మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు చేసేది లేక కట్టెల పొయ్యి మీద భోజనం సిద్ధం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పొగ బాధలతో సతమతమవుతున్నారు

10/16
తాటి చెట్టు సాధారణంగా నిటారుగా ఎలాంటి కొమ్మలు లేకుండా ఉంటుంది. కానీ అనంతగిరి రోడ్డులో రహదారి వెంట నల్గొండ జిల్లా కోదాడ పట్టణ శివారులో ఉన్న ఈ తాటి చెట్టుకు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు కొమ్మలు వచ్చాయి.

11/16
కుమురంభీం జిల్లా లింగాపూర్‌ మండల కేంద్రం పరిధిలోని సప్తగుండాల జలపాతం (మిట్టె) జలకళ సంతరించుకుంది. మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పచ్చటి ప్రకృతి అందాల మధ్య సహజసిద్ధంగా జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

12/16
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం గోప్లాపూర్‌ గ్రామంలో ఓ రైతు అర ఎకరా విస్తీర్ణంలో రెండు రకాల చిక్కుళ్లను కలిపి సాగుచేశారు. ప్రస్తుతం తోట పూత దశలో ఉంది. తెలుపు, ఊదా రంగు పూతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దూరం నుంచి చూసేవారికి పూల తోటను తలపిస్తోంది. 

13/16
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆదివారం ప్రముఖ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేసిన సంజయ్‌ను చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు. 

14/16
తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

15/16
విజయవాడ ఎస్‌బీఐ కాలనీ-1లోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న పనస చెట్టు కాండం పొడవునా.. గుత్తులుగా 55కి పైగా కాయలు కాసి చూపరులను ఆకట్టుకుంటోంది. యాదృచ్ఛికంగా పనస పండు తిని విత్తనం పారేయగా చెట్టుగా ఎదిగి ఇలా పండ్లను ఇస్తోందని చెప్పారు.  

16/16
జనసేన పార్టీ సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ అయిన ఓ ఫొటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఫ్యామిలీ పిక్‌ అది. తన శ్రీమతి అనా, పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో కలిసి దిగిన ఆ అరుదైన స్టిల్‌ వైరల్‌ అవుతోంది. 

మరిన్ని