- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Samyuktha: సంయుక్త
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు నటి సంయుక్త (Samyuktha). ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘డెవిల్’ (Devil). సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సంయుక్తకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
Updated : 29 Dec 2023 16:17 IST
1/17
కేరళలోని పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త 21 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
2/17
2016లో విడుదలైన ‘పాప్‌కార్న్’ (మలయాళం) ఆమె తొలి చిత్రం. ఇందులో ఆమె అంజనా అనే పాత్రలో కనిపించారు.
3/17
తొలి చిత్రంతోనే విజయం అందుకున్న సంయుక్తకు మలయాళంతోపాటు తమిళంలోనూ సినిమా అవకాశాలు దక్కాయి.
4/17
2018లో విడుదలైన ‘లిల్లీ’ (మలయాళం) సంయుక్త కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. ఇందులో ఆమె టైటిల్ రోల్ పోషించారు.
5/17
‘భీమ్లానాయక్’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రానాకు జంటగా కనిపించారు. ఈ సినిమా కోసం ఆమె తెలుగు నేర్చుకున్నారు.
6/17
‘భీమ్లానాయక్’లో సంయుక్త నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమెను తెలుగులో వరుస అవకాశాలు వరించాయి.
7/17
ఈ ఏడాది విడుదలైన ‘విరూపాక్ష’లో నందినిగా ఆమె నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటన సినీ ప్రియులను కట్టిపడేసింది.
8/17
‘నటిగా విలక్షణమైన పాత్రల్లో నటించాలనే ఆలోచన నాకు ఉంది. అందుకు అనుగుణంగా కెరీర్ మొదలైన నాటి నుంచి విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె.
9/17
‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను. స్టార్ హీరోయిన్ అవుతానని కొంతమంది ఊహించలేదు. హీరోయిన్గా సక్సెస్ అందుకున్నాక వాళ్లే నాకు విషెస్ చెప్పారు. అందుకు ఎంతో సంతోషించా’ అని ఓ సందర్భంలో సంయుక్త అన్నారు.
10/17
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. నటిగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.
11/17
సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో సంయుక్తకు అధికారిక ఖాతాలు ఉన్నాయి. అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఆమె ఎక్కువగా ఇన్‌స్టా ఉపయోగిస్తుంటారు.
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్‌తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!