బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 15:25 IST

పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది: చంద్రబాబు

అమరావతి: అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తూ మాట్లాడారు. ‘‘అమరావతి అనేది గతంలో ప్రముఖ నగరం. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సూచించారు. యమునా నది నీరు, పార్లమెంట్‌ మట్టిని మోదీ తెచ్చారు. వాటి మహిమ అమరావతిలో ఉంది. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం అమరావతి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ  కమిటీ చెప్పింది’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు