బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 13:43 IST

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్‌ సీజన్‌ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘‘నకిలీ విత్తనాలకు చెక్‌పెట్టాలి. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ఖరీఫ్‌లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి’’ అని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

మరిన్ని

తాజా వార్తలు