బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 17:26 IST

ఆ యాప్స్‌లో కరెంట్‌ బిల్లు చెల్లింపులు కుదరవ్‌!

ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే, గూగుల్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌.. విద్యుత్‌ బిల్లులు చెల్లింపు సేవలను నిలిపివేశాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి వీటిని ఆపేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థలైన TGSPDCL, TGNPDCL, APSPDCL, APEPDCL, APCPDCL భారత్‌ బిల్లు పేమెంట్‌ సిస్టమ్‌కు మారకపోవడమే కారణం. తమ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లోనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 

మరిన్ని

తాజా వార్తలు