Prince: ‘ప్రిన్స్‌’గా శివ కార్తికేయన్‌.. ఉర్రూతలూగిస్తున్న ఫస్ట్‌ సింగిల్‌

తమిళ నటుడు శివకార్తికేయన్‌ హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు అనుదీప్‌ కె. వి. తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘ప్రిన్స్‌’.

Updated : 07 Dec 2022 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు శివ కార్తికేయన్‌ (Siva karthikeyan) హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు అనుదీప్‌ కె. వి. (Anudeep KV) తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). ఉక్రెయిన్‌ నటి మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా తొలి పాటని విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ‘బింబిలికి’ అనే ఈ హుషారైన గీతాన్ని రామ్‌ మిర్యాల, రమ్య బెహర, సాహితి చాగంటి ఆలపించారు. తమన్‌ స్వరాలందించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలక పాత్రధారి. డబ్బింగ్‌ చిత్రాలు ‘రెమో’, ‘డాక్టర్‌’, ‘కాలేజ్‌ డాన్‌’లతో శివ కార్తికేయన్‌ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని