Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌

ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల‌ కాల వ్య‌వ‌ధికి ఉన్న ఎఫ్‌డీల‌కు అధిక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తుంది.

Updated : 01 Sep 2022 19:28 IST

ప్ర‌ముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల‌లో ఒక‌టైన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల‌తో 7వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా బ్యాంకు దేశీయ, NRE/NRO ఖాతాదారుల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు స‌వ‌రించిన‌ట్లు ప్ర‌క‌టించింది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 888 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.32 శాతాన్ని, సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు ప‌రిమిత వ్య‌వ‌ధిలో 7.82 శాతం వ‌ర‌కు, NRE ఖాతాదారుల‌కు 7.47 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేట్ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ ప్ర‌త్యేక ఆఫ‌రు కింద నెల‌వారీ, త్రైమాసికంగా కూడా వ‌డ్డీ చెల్లింపు ఎంపిక‌లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫ‌ర్‌ 2022 సెప్టెంబ‌ర్ 1 నుంచి 7 వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.

సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ వ‌డ్డీ రేట్లు..


NRE ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ వ‌డ్డీ రేట్లు..

గమనిక: ఈ బ్యాంకు 1 సంవ‌త్స‌రం నుంచి 3 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అధిక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని