kalanjali_200
Comments
0
Recommend
0
Views
369
విపత్తుల్లో భారత్‌ది మూడో స్థానం
దిల్లీ: గత ఏడాది విపత్తుల వల్ల బాగా నష్టపోయిన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉందని తేలింది. ఆ ఏడాది దేశంలో 2800 మంది చనిపోయారని, రూ.22వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది. ఐరాసకు చెందిన విపత్తు ముప్పు నియంత్రణ కార్యాలయం (యూఎన్‌ఐఎస్‌డీఆర్‌) తాజాగా విడుదల చేసిన అధ్యయన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేసింది. 2015లో మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా 22,700 మంది బలికాగా.. 6650 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ఈ జాబితాలో చైనా, అమెరికాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చైనాలో 26, అమెరికాలో 22, భారత్‌లో 19 చొప్పున విపత్తులు సంభవించాయి. రికార్డుల్లో అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2015 నమోదైన నేపథ్యంలో వాతావరణ సంబంధ విపత్తులు పెరిగినట్లు యూఎన్‌ఐఎస్‌డీఆర్‌ అధిపతి రాబర్ట్‌ గ్లాసర్‌ తెలిపారు. గత పదేళ్ల సరాసరితో పోలిస్తే 2015లో కరవుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువైందన్నారు.
Your Rating:
-
Overall Rating:
0