kalanjali_200
Comments
0
Recommend
0
Views
3550
మోదీ వివాహ వివరాలను కోరిన జశోదాబెన్‌
స.హ.చట్టం కింద దరఖాస్తు
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ పాస్‌పోర్ట్‌ పొందే సమయంలో వివాహ స్థితి గురించి ఏ వివరాలు ఇచ్చారో తెలపాల్సిందిగా ఆయన భార్య జశోదాబెన్‌ కోరారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ పాస్‌పోర్టు కోసం చేసిన దరఖాస్తులో వివాహానికి సంబంధించి ఏయే పత్రాలు ఇచ్చారో తెలపాల్సిందిగా అహ్మదాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి ఆమె స.హ.చట్టం కింద దరఖాస్తు చేశారు. మోదీకి, ఆమెకు వివాహం జరిగినట్లు ధ్రువపత్రం లేదనే కారణంతో జశోదాబెన్‌ పాస్‌పోర్టు దరఖాస్తును గత నవంబరులో పాస్‌పోర్టు కార్యాలయం తిరస్కరించింది. దీంతో తన భర్త మోదీ ఏ వివరాలు ఇచ్చారో ఇవ్వాల్సిందిగా ఆమె దరఖాస్తు చేశారు. ఈ వివరాలను ఆమె తెలుసుకోవాలనుకోవడంలో తప్పేమీ లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ గురువారం వ్యాఖ్యానించారు.
Your Rating:
-
Overall Rating:
4.6