kalanjali_200
Comments
0
Recommend
0
Views
301
మూడేళ్లలో వందమంది విదేశీ పర్యటన
దిల్లీ: గత మూడేళ్లలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన 100 మందికి పైగా ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చారు. వారి పేర్లు, 2013 నుంచి 2015 సంవత్సరాల మధ్య పర్యటించిన దేశాల వివరాలను వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వశాఖ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ‘ఇది తుది జాబితా కాదు ఈ పర్యటనల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది’ అని ఆ మంత్రిత్వశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి సెలవిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం అండర్‌ సెక్రెటరీ నుంచి సెక్రెటరీ స్థాయి హోదా ఉన్న అధికారులు ఇప్పటివరకు మొత్తం 16 దేశాలు చుట్టొచ్చారు. వారిలో 44 మంది ఎనిమిది, 24 మంది మూడు, 38 మంది ఐదు దేశాలు పర్యటించినట్టు తెలుస్తోంది. ఎక్కువమంది బ్రిటన్‌, సింగపూర్‌, మలేసియా, బెల్జియం, కొరియా, అమెరికా, కెనడా, బ్రెజిల్‌ పర్యటనలకు వెళ్లారు. ఇరవైరెండు మంది రెండుసార్లు ఒకే దేశానికి వెళ్లొచ్చారు. ప్రభుత్వాధికారులు తమ విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ఆర్థికశాఖ ఆదేశించిన నెలరోజుల తర్వాత ఈ వివరాలు అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయం, విదేశీ వ్యవహారాలు, హోం, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక, న్యాయమంత్రిత్వ శాఖలతోపాటు తెలంగాణ, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ పర్యటనలు జరిపారు.
Your Rating:
-
Overall Rating:
0