kalanjali_200
Comments
0
Recommend
0
Views
3106
తొలిరోజు రూ.21,000కోట్లు
కుదిరిన మూడు ఒప్పందాలు
ముందుకొచ్చిన స్టెరిలైట్‌, రేమండ్‌
హిందుస్థాన్‌ కోకకోలా, జైన్‌ ఇరిగేషన్‌లూ
ముంబయి: భారత్‌లో తయారీ వారంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో తొలిరోజు రూ.21,000 కోట్లకుపైగా విలువైన మూడు అవగాహన ఒప్పందాలు(ఎమ్‌ఓయూ) కుదిరాయి. ఎల్‌సీడీల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు స్టెరిలైట్‌ గ్రూపు కంపెనీ ట్విన్‌స్టార్‌ డిస్‌ప్లే టెక్నాలజీస్‌ మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ(ఎంఐడీసీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.20,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్లాంటు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించారు. పొలం నుంచి వస్త్రం వరకు కార్యక్రమంలో భాగంగా.. రేమండ్‌ ఇండస్ట్రీస్‌, ఎంఐడీసీల మధ్య మరో ఒప్పందం కుదిరింది. లినెన్‌ దారం, వస్త్రం, దుస్తుల ఉత్పత్తి కోసం రేమండ్‌ రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. కర్మాగారాన్ని అమరావతి జిల్లా నందగావ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఏర్పాటు చేస్తారు. విదర్భ ప్రాంతంలోని రైతుల నుంచి పత్తిని సమీకరిస్తారు. హిందుస్థాన్‌ కోకకోలా బెవరేజెస్‌, జైన్‌ ఇరిగేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మహారాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ విభాగం మధ్య మూడో ఒప్పందం కుదిరింది. విదర్భ ప్రాంతంలో నారింజ రైతులకు మద్దతుగా పండ్ల రసాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 2500కు పైగా అంతర్జాతీయ; 8000కు పైగా దేశీయ కంపెనీలు పాలుపంచుకోనున్నాయి. 68 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు; 72 దేశాల నుంచి వాణిజ్య దిగ్గజాలు పాల్గొంటున్నారు.
మోదీ ప్రభుత్వానిది సునిశిత దృష్టి: బిర్లా
నరేంద్ర మోదీ ప్రభుత్వానిది సునిశిత దృష్టి అంటూ పారిశ్రామికవేత్త కుమార మంగళంబిర్లా కితాబునిచ్చారు. వాణిజ్య వాతావరణంలో మార్పు చోటుచేసుకుందనీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక పెరిగిందని పేర్కొన్నారు. భారత్‌లో తయారీ వారం కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు సహనంతో ఉండాలనీ, మార్పనేది వెంటనే రాదనీ, సమయం పడుతుందన్నారు. భారత్‌లో తయారీ వారంలో భాగంగా హరియాణా పెట్టుబడుల రోడ్‌షో నిర్వహించనుంది. సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆదివారం రోడ్‌షోను ప్రారంభించనున్నారు. ఖట్టర్‌ విదేశీ ప్రతినిధులతో సమావేశాలు జరుపనున్నారు.
పెట్టుబడుల పెంపుపై ఆసక్తి: స్వీడన్‌ ప్రధాని
భారత్‌లో తయారీ వారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్వీడన్‌ పెవిలియన్‌ను ప్రధాని మోదీ, స్వీడన్‌ ప్రధాని స్టీఫాన్‌ లాఫ్వెన్‌ ప్రారంభించారు.లాఫ్వెన్‌ పెద్దసంఖ్యలో ప్రతినిధి బృందంతో హాజరయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు, ఉత్పత్తికేంద్రాల్ని నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ దేశ రాయబారి హెరాల్డ్‌ సాండ్‌బర్గ్‌ పేర్కొన్నారు.

బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతాం: సానీ గ్రూప్‌
చైనాకు చెందిన భారీ ఉపకరణాల తయారీ దిగ్గజం సానీ గ్రూప్‌ వచ్చే పదేళ్లలో వందకోట్లకుపైగా డాలర్ల పెట్టుబడులు (దాదాపు రూ.6500 కోట్లు) పెట్టనున్నట్లు ప్రకటించింది. పుణె కేంద్రంలో ఇప్పటికే పది కోట్లడాలర్లు పెట్టామనీ, దశాబ్దికాలంలో పెంచనున్నట్లు గ్రూప్‌ ప్రెసిడెంట్‌ టాంగ్‌ క్సివ్‌గ్యుయో పేర్కొన్నారు.

అన్నిటినీ ఒక చోటికి.. ఒరాకిల్‌: ఏప్రిల్‌లో ముంబయిలో ప్రపంచ క్లౌడ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఒరాకిల్‌ ప్రకటించింది. సాంకేతిక సంస్థలను ఒకేచోటికి తీసుకొస్తామని సంస్థ ప్రపంచ సీఈఓ సాఫ్రా కాట్జ్‌ పేర్కొన్నారు.

టైమ్‌ ఇండియా అవార్డులు
తొలి టైమ్‌ ఇండియా అవార్డులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదే కార్యక్రమంలో ప్రదానం చేశారు. అత్యుత్తమ తయారీ అవార్డును టాటా స్టీల్‌; ‘ఇన్నోవేటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును హీరో మోటోకార్ప్‌లు దక్కించుకోగా.. అజంతా ఫార్మాకు చెందిన యోగేశ్‌, రాజేశ్‌ అగర్వాల్‌లకు ‘యంగ్‌ మేకర్స్‌ ఆఫ్‌ ఇయర్‌’ అవార్డు దక్కింది. అదే సమయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న వివిధ సంస్కరణలపై కేపీఎమ్‌జీ తయారు చేసిన నివేదికను సైతం ప్రధాని ఇక్కడ విడుదల చేశారు.
Your Rating:
-
Overall Rating:
5.0

ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తే...పోలీసులే చూసుకుంటారు

‘‘సర్‌... నాపేరు రమేష్‌ యాదవ్‌... సికింద్రాబాద్‌లో ఉంటున్నా. నా ద్విచక్ర వాహనాన్ని అమ్మి 16 నెలలయింది. రెండు నెలల నుంచి ఇంటికి ఇ-చలానాలు వస్తున్నాయి.

స్థానిక పాలన స్తంభన

పల్లె పాలనలో పారదర్శకత తేవడానికి, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో తీసుకురావడానికి అన్ని గ్రామపంచాయతీలను డిజిటల్‌గా మార్చారు. తడి, పొడి చెత్త వేరుచేసి గ్రామానికి దూరంగా...

ఏడు కొండలవాడు..

రథసప్తమి పర్వదినాన.. శ్రీనివాసుని భక్తకోటి ఆరాధించనుంది. మాఘశుద్ధ సప్తమి పర్వదినాన సూర్యజయంతి సందర్భంగా అరుణోదయ కాలంలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానించడం...

కలిసి సాగితే.. కదులు జలం

జిల్లా వాసుల తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. పురపాలక, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్‌, నీటి పారుదల...