kalanjali_200
Comments
-
Recommend
0
Views
0
దిల్లీ వాహన ప్రదర్శనకు తొలి రోజే 80,000 మంది
గ్రేటర్‌ నోయిడా: సాధారణ ప్రజలను అనుమతించిన తొలిరేజే (శుక్రవారం) 80,000 మంది దిల్లీ వాహన ప్రదర్శనను తిలకించారు. ఆయా వాహన సంస్థల స్టాల్స్‌ వద్ద సరికొత్త ఉత్పత్తులను వీక్షిస్తూ సందడి చేశారని భారతీయ వాహన తయారీదారుల సంఘం(సియామ్‌) తెలిపింది. బుధవారం(3న) ప్రారంభమైన ఈ వాహన ప్రదర్శనలో మొదటి రెండు రోజులు కేవలం ప్రసార మాధ్యమాలు, పారిశ్రామిక ప్రముఖులను అనుమతించారు. ఈ నెల 9తో ముగియనున్న ఈ ప్రదర్శనను సియామ్‌, వాహన విడి భాగాల తయారీదారుల సంఘం, భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్‌, హోండా, టాటా మోటార్స్‌, ఆడీ వంటి వాహన సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.
Your Rating:
-
Overall Rating:
0

మెట్రో రయ్‌రయ్‌

మెట్రోరైలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. నాగోల్‌ నుంచి మెట్టుగూడ, మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 20 కి.మీ. మెట్రో మార్గం పూర్తయి...

కనిష్ఠం

సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తూ తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుపొందిన నాగార్జునసాగర్‌ జలాశయం బోసిపోతోంది.

బండేసి.. బాదేసి..

గ్యాస్‌ బండ.. పేరు వింటేనే ప్రజలు హడలి పోతున్నారు. ఓ వైపు ప్రభుత్వం ధరలు పెంచేస్తుండగా.. మరోవైపు డెలివరీ బాయ్‌లు అదనపు వసూళ్లతో ప్రజలపై భారం మోపుతున్నారు.

రద్దీ రూట్లపై దృష్టి

విజయవాడకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు కీలక ప్రాంతాలకు నూతన సర్వీసుల ఏర్పాటుపై ఆర్టీసీ దృష్టి సారించింది. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌...