Monday, July 06, 2015


Untitled Document
Untitled Document
్చ్ట్జ

అందమైన అడవులు..సహజ వనరులు..ప్రకృతి సోయగాల ఖిల్లా.. ఆదిలాబాద్‌ జిల్లా . ఆది మానవులకు, గిరిజన సంస్కృతికి పుట్టినిల్లుగా పేరెన్నికగన్న జిల్లా..నేటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న పురాతన కట్టడాలు, కోటలు, గుళ్లు, నిర్మాణాలు, చెక్కిన రాళ్లు చరిత్రను తెలుసుకునేందుకుఉత్సుకతను రేకిత్తిస్తు ంటాయి. గోదావరి తీరాన వెలిసిన జ్ఞానసరస్వతి క్షేత్రంతో సహా పవిత్ర క్షేత్రాలెన్నో జిల్లాలో వెలిసి ఉన్నాయి.

జిల్లా పేరు ఎలా వచ్చిందంటే
జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ పేరుతో జిల్లాకీ పేరు వచ్చింది. అయితే ఆదిలాబాద్‌ పట్టణానికి ఆపేరు ఎలా వచ్చిందనే విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి.16వ శతాబ్దంలో బీజాపూర్‌ను పాలించిన ‘ఆదిల్‌షా’ పేరు మీద పట్టణానికి ఆపేరు వచ్చిందని కొందరు చరిత్రకారులు అంటారు.ఆదిల్‌షా తన ఆర్థికమంత్రి సేవలకు మెచ్చి ఇప్పటి ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని జాగీరుగా రాసిచ్చాడు. ఆర్థికమంత్రి ఆ ప్రాంతంలో ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ‘ఆదిల్‌షాబాద్‌’ అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆదిల్‌షాబాద్‌ ప్రజల నోట నాని ఆదిలాబాద్‌గా మారిందంటారు. మరో కథనం ప్రకారం ఆదిలాబాద్‌ పట్టణాన్ని ఒకప్పుడు ఎదులాపురం అనే పేరుతో పిలిచేవారు.ఈ ప్రాంతంలో క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున ‘ఎద్దుల’ సంత జరిగేది.ఎద్దులాపురం, ఎదులాపురం, ఎడ్లపురంగా మారింది. దీనిని మహ్మదీయుల కాలంలో ఆదిలాబాద్‌గా మార్చినట్లు తెలుస్తోంది.

జిల్లా ఏర్పాటు
1905లో జిల్లా ఏర్పాటయ్యింది. మహారాష్ట్రలోని నాందేడ్‌, యవత్మాల్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో సహా జిల్లా ఏర్పాటయ్యింది.ఆసిఫాబాద్‌ రాజధానిగా ఉండేది. ఆతర్వాత ఆదిలాబాద్‌కు మారింది. అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా మరాఠీ మాట్లాడే ప్రాంతాలు మహారాష్ట్రకు వెళ్లగా.. అక్కడి తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కలిపి ప్రస్తుతమున్న జిల్లా ఆవిర్భావం జరిగింది. గతంలో 11 సమితులు (తాలుకాలు) ఉండేవి. అవి ఆదిలాబాద్‌, బోథ్‌, ఉట్నూరు, నిర్మల్‌, ముథోల్‌, లక్సెట్టిపేట , ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, వాంకిడి, సిర్పూర్‌ , చెన్నూర్‌లు.. ఆదిలాబాద్‌, ఉట్నూరు, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రెవెన్యూ డివిజన్‌లుండేవి. ప్రస్తుతం అదనంగా మంచిర్యాల డివిజన్‌ ఏర్పాటయ్యింది. అదేవిధంగా సమితుల స్థానంలో పరిపాలన సౌలభ్యం మండల వ్యవస్థ రావటంతో 52 మండలాలు ఏర్పడ్డాయి.జిల్లాలో 866 గ్రామ పంచాయతీలున్నాయి.

జిల్లా సరిహద్దులు
ఆదిలాబాద్‌ జిల్లా 18-40-19-56 డిగ్రీల అక్షాంశాలు, 70-40-80 డిగ్రీల మధ్య విస్తరించి ఉంది. ఉత్తరాన మహారాష్ట్రలోని యవత్మాల్‌, చాంద్రాపూర్‌ జిల్లాలు, తూర్పు దిశలో చంద్రాపూర్‌ జిల్లా, దక్షిణాన నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలు, పశ్చిమాన నాందేడ్‌ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.నదుల పరంగా చూస్తే దక్షిణ సరిహద్దుగా గోదావరి, తూర్పు సరిహద్దుగా ప్రాణహిత ఉత్తర సరిహద్దుగా పెన్‌గంగ, వార్ధా నదులున్నాయి. జిల్లా వైశాల్యం 16203.8 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉంది. జిల్లా విస్తీర్ణంలో 40శాతం అడవులుండేవి. నేడు క్రమంగా అవి అంతరిస్తున్నాయి. జిల్లా మొత్తం జనాభాలో 17 శాతం మంది గిరిజనులే.

రాజులు, సుల్తానులు, నవాబుల పాలన..
ప్రసిద్ధ రాజవంశీయుల పాలనలో ఉన్న జిల్లా ఇది. మౌర్యులు, శుంగులు, శాతవాహనులు, వాకాటకులు, విష్ణుకుండినులు, పశ్చిమ చాళక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణీచాళక్యులు, దేవగిరి యాదవరాజులు, కాకతీయులు, గోండురాజులు, బహమనీ సుల్తానులు, బెరారు, ఇమాద్షాహీలు, అహమద్నగర నిజాంషాహీలు, గోల్కోండ నవాబులు, మరాఠాలు, మొగలులు, అసఫ్జా వంశీయు పాలనలో జిల్లా ఉండేది.


నిర్మల్‌ ‘కళ’ అద్భుతం
నిర్మల్‌ బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.దేశ విదేశాల్లోనూ ఇక్కడి బొమ్మలు, పెయింటింగ్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. 400 ఏళ్ల క్రితం నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయుడు కొయ్య బొమ్మలను తయారుచేసే కళాకారులను తీసుకొచ్చి ఉపాధి కల్పించారు. అప్పటి నుంచి దాదాపు 40 కుటుంబాలు (నగిశి) ఈ కళను నమ్ముకొని జీవిస్తున్నారు. హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం ద్వారా అమెరికా, రష్యా, అరేబియా, మలేషియా, ఇరాన్‌, దుబాయ్‌, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, తదితర దేశాలకు నిర్మల్‌ బొమ్మలను ఎగుమతి చేస్తున్నారు. కళాకారులు తయారు చేసిన పశుపక్షులు, జంతువులు, సైనిక విన్యాసాలు, రాజభోగ విలాస వస్తువులు, డీకో పెయింటింగ్స్‌, దేవతా చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్‌, ఇచ్చోడ అటవీ పరిధిలోని పెరిగే ‘పొనికి’ చెట్ల కలపతో నిర్మల్‌ బొమ్మలను తయారు చేస్తారు.అటవీశాఖ అనుమతితో నిర్మల్‌లోని పారిశ్రామిక కేంద్రానికి కలపను (చెక్క) తరలిస్తారు. ఇటీవల ఈ చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో అటవీశాఖ అధికారులు అనుమతులు నిరాకరిస్తుండటంతో నిర్మల్‌ బొమ్మల ‘కళ’ తప్పుతోంది.


కొమరం భీం
నవనాగరికతకు దూరంగా ఉన్న గిరిజనులపై నిజాం నవాబు పాలనలో జరుగుతున్న అరాచకాలను ఎదిరించి వారిని చైతన్య పరిచిన మహోన్నత వ్యక్తి కొమరం భీం. అభివృద్ధికి ఆమడ దూరంలో జోడెఘాట్‌ గ్రామంలో కొమరం భీం జన్మించాడు. గిరిజనుల ఆక్రందనను రణ నినాదంగా మార్చి కొండ కోనల్లోని గిరిజనులను మేల్కొలిపిన మహాశక్తి కొమరంభీం. అమాయక గిరిజనులపై నిజాం సర్కార్‌ పాశవిక చర్యలను చూసి కొమరం భీం చలించిపోయాడు. నిస్తేజమై నిద్రావస్థలో ఉన్న తోటి గిరిజనుల కళ్లల్లో జ్వాలలు రేకెత్తించాడు. సాటిగిరిజనుల కష్టాలను కడతేర్చేందుకు కంకణం కట్టుకుని భూమి, భుక్తి, విముక్తి కోసం జరిపిన పోరాటంలో చివరకు కొమరం భీం అమరుడయ్యాడు.

ఉద్యమ ప్రస్థానమిదీ..
భీం బాల్యమంతా కష్టాలతోనే నడిచింది. తన పదిహేనేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. దీంతో సోదరులు కొమరం కొద్దు, ఇస్రులతో కలసి కెరమెరి మండల సుర్దాపూర్‌కు వలసవచ్చాడు. అక్కడే అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సమయంలో సిద్దిఖ్చ్ఝ్పీ; అనే పట్టేదారు ఈ భూములన్నీ తనవేనని, పంటకూడా తనకే దక్కాలని పట్టుపట్టడంతో ఆగ్రహించిన సిద్దిఖ్చ్ఝ్పీ; పై భీం దాడిచేసి హత్య చేశాడు. నిజాం పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి పూనా, చాందా వంటి దూరప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నాడు. అస్సాంలోగడిపిన ఐదేళ్ల కాలంలో చదవటం, రాయడం కొంతవరకు నేర్చుకున్నాడు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకున్న భీం తన ప్రాంతంలో గిరిజనులపై జరుగుతున్న అరాచకాలపై పోరు ప్రారంభించాడు. కెరమెరి మండలంలోని బాబేఝరి చుట్టుపక్కల 12 గిరిజన గ్రామాల్లో అడవిని నరికి సేద్యానికి యోగ్యంగా చేశాడు. ఇదే సమయంలో కొమరం భీం కొకన్‌ఘాట్‌ వెళ్లి పెద్ద అన్న భూములకు పరిష్కారం కుదుర్చుకోవడానికి అటవీశాఖ అధికారులతో చర్చలు జరిపి సఫలీకృతుడయ్యాడు. అదే విధంగా 12 గ్రామాల్లోని గిరిజనుల భూములకు కూడా పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ అసిఫాబాద్‌ కలెక్టర్‌కు వినతి పత్రాలు పెట్టుకున్నాడు. చివరకు నిజాం ప్రభువును కలిసినా ప్రయోజనం లేకపోవడంతో గోండులను సమైక్య పరచి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. పరిస్థితులు విషమించడంతో నిజాం ప్రభువు కొమరం భీంతో సంధి కుదుర్చుకోవడానికి కలెక్టర్‌కు జోడెఘాట్‌కు పంపాడు. బాబెఝరి చుట్టూ ఉన్న భూముల్ని గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీలిచ్చాడు. అయినా భీం లొంగలేదు. పన్నెండు గ్రామాలకు స్వాతంత్య్రం ప్రకటించాలని, వాటిపై తమకు తప్ప ఇతరులకు అధికారాలు ఉండరాదని పట్టుపట్టాడు. అదేవిధంగా జైళ్లలో ఉన్న తమ అనుచరులను విడుదల చేయాలని భీం డిమాండ్‌ చేశాడు. భీం డిమాండ్లను ఒప్పుకోని ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 1940లో కొమరం భీం శిబిరంపై నిజాం సైన్యం ఒక్కసారిగా దాడి చేసింది. వీరోచితంగా పోరాడిన భీం చివరకు అసువులు బాసాడు. భీం స్మారకార్థం ప్రతియేట ఆశ్వీయుజ పౌర్ణమిరోజున జోడేఘాట్‌లో ఆయన వర్థంతి ఘనంగా జరుపుకుంటున్నారు.


జిల్లాకు వెలుగు తెచ్చిన జేవీ
జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1967-72లో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జేవీ నర్సింగరావు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందినవారే. జేవీ 1914 అక్టోబరు 14న దండేపల్లి మండలం ధర్మరావు పేటలో జన్మించారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, విద్యుచ్ఛక్తి బోర్డు ఛైర్మన్‌గా, ఉపముఖ్యమంత్రిగా ఇటు జిల్లాకు, అటు రాష్ట్రానికి తనదైన శైలిలో సేవలందించారు.ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడానికి జేవీ శత విధాల ప్రయత్నం చేశారు. న్యాయశాస్త్రం చదివిన జేవీ విద్యార్థి దశనుంచే సేవపై అభిరుచి పెంచుకుని రాజకీయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసి అపజయం పాలయ్యారు. 1955లో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి స్వీకరించారు. ఆ సమయంలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌ సంస్థాన విభజన జరగాలని నిర్ణయించారు. పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు చేసిన వారిలో జేవీ కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత ఏర్పడిన నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో జేవీ రోడ్లు, భవనాలు, నీటి పారుదల, విద్యుత్‌శాఖలు నిర్వహించారు. 1963 నుంచి 1966 వరకు రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డుకు ఛైర్మన్‌గా పనిచేశారు. 1962లో హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి, 1967లో జిల్లాలోని లక్సెట్టిపేట నియోజకవర్గం శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పదవులు నిర్వహించారు.జిల్లాలో నీటి పారుదల రంగానికి విశేష కృషి చేశారు. హైదరాబాద్‌లో తెలుగు భాషకు ఆదరణ లేని రోజుల్లో ఆంధ్రోద్యమంలో పాల్గొని తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు కృషి చేశారు. తెలుగు మాధ్యమంగా పలు ఆంధ్ర పాఠశాలలు నెలకొల్పారు. రాష్ట్రానికి విశేష సేవలందించిన జేవీ 1972లో సెప్టెంబరు 3న మృతి చెందారు.

రాజకీయ చాణక్యుడు.. వేణుగోపాలాచారి
వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే, మరో మూడు సార్లు ఎంపీగా గెలుపొంది జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో చురుకైనపాత్ర పోషించిన వ్యక్తి వేణుగోపాలాచారి. రాజకీయ చాణక్యుడిగా ఆయన పేరు పొందారు.

ఉద్యమ సారథులిద్దరూ ఆదిలాబాద్‌ వారే..
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరు సాగిస్తున్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ముద్దసాని కోదండరాంరెడ్డి జిల్లాలోని నెన్నెల మండల జోగాపూర్‌కాగా, తెలంగాణా సాధన ఉద్యమ సమన్వయ కమిటీ ఛైర్మన్‌ కొండాలక్ష్మణ్‌బాపూజీ వాంకిడికి చెందినవారు.

లక్ష్మణ్‌ బాపూజీ
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్‌ బాపూజీ జిల్లాలోని వాంకిడాలో 1915వ సంవత్సరంలో జన్మించారు. ఆసిఫాబాద్‌, వాంకిడి, మహారాష్ట్రలోని రాజూరాల్లో పాఠశాల చదువుకున్న బాపూజీ స్వాతంత్య్ర పోరాటంతో చురుగ్గా పాల్గొనేవారు. 1948లో నిజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలపడానికి జరిగిన పోలీసుయాక్షన్‌లో భారత ప్రభుత్వానికి మద్దతుగా సాయుధపోరాటం సాగించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముక్కుసూటి నాయకుడిగా ఎదిగారు. మంత్రిగా, డిప్యూటి స్పీకర్‌గా అనే పదవులు చేపట్టారు. 2012 సెప్టెంబరు 21న అస్వస్థతతో హైదరాబాద్‌లో కన్నుమూశారు.

కోదండరాం
1955లో జన్మించిన కోదండరాం మంచిర్యాల, వరంగల్‌లో విద్యాభ్యాసం చేసి రాజనీతిశాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 1996నుంచే తెలంగాణా ఉద్యమంపై ఉపన్యాసాలు నిర్వహించిన ఆయన 2003లో తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ ఐకాసకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

సింగరేణికే తలమానికం జిల్లా బొగ్గుగనులు
1926లో బెల్లంపల్లిలో ప్రారంభం
బొగ్గును మొదట ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలో గుర్తించారు. ఈ క్రమంలోనే బ్రిటీషు అధికారులు రైలు మార్గం ద్వారా 1927 సంవత్సరం ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లి ప్రాంతానికి వచ్చారు. ఒకప్పటికి గొండ్వానా భూభాగమైన గోదావరినది పరివాహక ప్రాంతమైన జిల్లా తూర్పు ప్రాంతంలో మొదటి సారిగా మార్గన్స్‌ అనే బ్రిటిషు అధికారితో పాటు మరికొందరు అటవీ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ చేశారు. ‘డాబి’ అనే అన్వేషణ అధికారి తనకున్న పరిజ్ఞానంతో బొగ్గును కనుగొన్నారు. మొదటి సారిగా జిల్లాలో మార్గన్స్‌ అనే అధికారి సారథ్యంలో బొగ్గు గనిని తవ్వకం ప్రారంభించారు. ఇదే గనికి ‘మార్గన్‌పిట్‌’ అనే పేరును పెట్టారు. అనంతరం బెల్లంపల్లిలో సౌత్‌క్రాస్‌కట్‌, నెం.2 ఇంక్లయిన్‌, 24డిప్‌, 84, 85డిప్‌ గనులు, 68 డిప్‌ గనిని, శాంతిఖనిని ప్రారంభించారు. 1961లో మందమర్రి, రామకృష్ణాపూర్‌ ప్రాంతాలలో గనులు ప్రారంభమయ్యాయి. 1971లో శ్రీరాంపూర్‌, 1991లో చెన్నూరు ప్రాంతంలో బొగ్గు గనుల ఆవిర్భావం జరిగింది. జిల్లాలో 1991 సంవత్సరం ముందు సుమారుగా 29 భూగర్భగనులను సింగరేణి యాజమాన్యం నిర్వహించింది. కాలక్రమేణా సింగరేణిలో సంస్కరణల మూలంగా భూగర్భగనుల స్థానంలో ఉపరితలగనులు(ఒపెన్‌కాస్టుగనులు)ను ప్రారంభించారు. మొదటి ఉపరితల గనిని బెల్లంపల్లిలోనే స్థాపించారు. బొగ్గు గనుల ఆవిర్భావంతో బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్‌, శ్రీరాంపూర్‌ పట్టణ రూపును సంతరించుకున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 19 గనులు నడుస్తున్నాయి. ఇందులో శ్రీరాంపూర్‌ ఏరియాలో తొమ్మిది గనులు(ఒక ఓసీపీ), మందమర్రి ఏరియాలో ఏడుగనులు(ఒసీపీ), బెల్లంపల్లి ఏరియాలో మూడు ఒపెన్‌కాస్టు ప్రాజెక్టులు, ఒక భూగర్భగని నడుస్తుంది. సుమారు 23వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంవత్సరానికి 33.65లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో ఒపెన్‌కాస్టు గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి తలమానికంగా మారింది. మూడు సింగరేణి పాఠశాలు, ఒక పాలిటెక్నిక్‌ కళాశాల(శ్రీరాంపూర్‌)ను సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుంది. మొదటి సారిగా 1200మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును జైపూర్‌ మండలంలో సింగరేణి నిర్మాణపనులు చేపట్టింది.

బొగ్గు గ్రేడులను నిర్ధరించే రీజియన్‌ ల్యాబ్‌ రామకృష్ణాపూర్‌లో ఉంది. రెండు సీఎస్పీలు ఉన్నాయి. సింగరేణి కాలరీస్‌ కంపెనీలో గుర్తింపు పొందిన కార్మిక నేతలందరూ జిల్లాకు చెందినవారే. మందమర్రి ఏరియాలోని శాంతిగని మొదటి లాంగ్‌వాల్‌ గనిగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు మూడు ఏరియాల్లో యాజమాన్యం పెద్ద యొత్తున మొక్కల పెంపకం చేపట్టింది. ఆరు క్రీడామైదానాలు ఉన్నాయి. రెండు పార్కులు, ఈత కొలనులను అందుబాటులోకి తీసుకువచ్చారు.


నాడు ఎసీసీ... నేడు ఏంసీసీ
సిమెంట్‌ కంపెనీల్లోనే తొలి తీగమార్గం

రొప్‌వే ద్వారా సున్నపురాయిని తరలిస్తున్న దృశ్యం
మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన అసోసియేటేడ్‌ సిమెంట్‌ కంపెనీ (ఏసీసీ) మంచిర్యాల సిమెంట్‌ కంపెనీగా మారింది. 1958-59లో ఏసీసీ యాజమాన్యం మంచిర్యాలలో సిమెంట్‌ కంపెనీ నెలకొల్పింది. సిమెంట్‌ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో క్వారీ నుంచి తరలించేవారు. సిమెంట్‌కు ఉపయోగించే సున్నంరాయిని తరలించేందుకు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఏసీసీ యాజమాన్యం తీగమార్గం (రోప్‌వే)ను ఏర్పాటు చేసింది. తీగమార్గం నుంచి మంచిర్యాల పట్టణంలోని సిమెంట్‌ కంపెనీకి ముడి సరుకు (సున్నంరాయి)ని బకెట్ల ద్వారా తరలిస్తుంటారు. క్వారీలో సున్నం రాయి నిల్వలు తగ్గటంతో తరువాత కాలంలో 25కిలో మీటర్ల దూరంలోని లోద్ది నుంచి సున్నంరాయి ఇక్కడకు చేరవేస్తున్నారు. ముందుగా లాభాల బాటలో నడిచిన కంపెనీ నష్టాల బాటన పట్టడం.. గడువు ముగిసిన క్వారీ లీజులో జాప్యం జరగటం వల్ల ప్రస్తుత యాజమాన్యానికి విక్రయించారు. 2004లో ఎంసీసీ సిమెంట్‌ కంపెనీగా పేరు మార్చి కొనసాగిస్తున్నారు.
తీగమార్గంకు అంకుర్పారణ జరిగిందిలా..
చుట్టూ దట్టమైన అడవి.. ఎతైనా కొండలు.. వాగులు.. వంకలు మీదుగాపర్యావణం దెబ్బతినకుండా రొప్‌వే ఏర్పాటు చేసి గగయానంలో సున్నంరాయిని తరలించేందుకు ఏర్పాటు చేశారు. 1958-59లో ఏసీసీ సిమెంట్‌ కంపెనీ యాజమాన్యం స్వీడన్‌ దేశం నుంచి సాంకేతిక పరికరాలు దిగుమతి చేసుకుని రోప్‌వే ఏర్పాటు చేశారు. 4.4 కిలో మీటర్ల దూరం వరకు కేబుల్‌ ద్వారా సున్నంరాయి తరలించారు. 44ఎంఎం ట్రాక్‌రోప్‌, 21ఎంఎం హలోజ్‌రోప్‌తో బైకేబుల్‌ ఏర్పాటు చేశారు. మొదట్లో బైకేబుల్‌ (రెండు తాళ్లతో) ద్వారా సున్నంరాయి తరలించిన యాజమాన్యం సర్వాయి లోద్ది మొదటి క్రషర్‌ నుంచి రెండో క్రషర్‌ వరకు మోనోకేబుల్‌ (ఒకే తీగ)ద్వారా రవాణా చేస్తోంది. 19.6 కిలోమీటర్ల వరకు మోనోకేబుల్‌ రోప్‌వేను ఏర్పాటు చేశారు. 484 బకెట్ల ద్వారా క్వారీ పార్కు వరకు.. బైకేబుల్‌ ద్వారా 90 బకెట్లలో సున్నం రాయి మంచిర్యాల సిమెంట్‌కంపెనీకి చేరుతోంది. గంటకు 10నుంచి 15కిలో మీటర్ల వేగంతో మొత్తం 574 బకెట్లు ద్వారా ఇక్కడ సున్నంరాయిని తరలిస్తుంటారు.
Untitled Document
©äÈ-ªý-„Ãœ¿ ‡®Ôq-©åXj ¤òM-®¾Õ© Oª½¢’¹¢
ª½£¾Ç-ŸÄJ «Ö§ŒÕ¢
«âœµ¿-Ê-«Õt-Âé Eª½Öt-©-ÊÂ¹× Â¹%†Ï Í䧌ÖL
‚-ªî’¹u ꢓŸ¿¢ ²ÄyDµÊ¢ Í䮾Õ-Âî-„ÃL
’¹Õ¢-œç-¤ò-{ÕÅî «Õ%A
‚œ¿Õ-¹ע-ŸÄ-«ÕE „çRx ÆʢŌ ©ðÂÃ-©Â¹×.-.-
Ʀµ¼u¢-ÅŒ-ªÃ-©Õ¢˜ä ®¾«-J¢-ÍŒÕ-Âî-„ÃL
’î-ŸÄ-«-J©ð «áET «uÂËh «Õ%A
…Ÿîu-’é Â¢ ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-X¾Û©Õ
®Ï¢’¹-êªºË „ÃuX¾h¢’à 42-©Â¹~© „çṈ©Õ ¯Ã{ÕÅâ
NŸ¿ÕuÅŒÕh ꢓŸ¿¢©ð „çṈÊÕ ¯ÃšËÊ ®Ô‡¢œÎ
…Ÿîu’¹ Æ«-ÂÃ-¬Ç-©åXj §Œá«-ÅŒÂ¹× Æ«-’Ã-£¾ÇÊ
«Ü£¾Ç©ðx N£¾Ç-J¢-͌¹×.-.- „î¾h-«¢©ð °N¢ÍŒÕ: ª½ÍŒ-ªáÅŒ ÍŒ©Çx ®¾Õ“¦-£¾Çtºu¢
¤ÄL-˜ã-ÂËoÂþ ¹@Ç-¬Ç-©©ð £¾ÇJ-ÅŒ-£¾Éª½¢
ÂÃJt-¹×-©ÊÕ ÆGµ-Ê¢-C¢-*Ê ‡²ÄqKpÐ-3 ’¹E „äÕ¯ä-•ªý
X¾ÍŒaÅº¢ ÂÄÃL
£¾Çô{©ü Ʋò-®Ï-§äÕ-†¾¯þ Í䧌âÅŒ
•¢ŸÄ-X¾Ü-ªý©ð ªÃuM
®ÔXÔ‰ ‚Ÿµ¿y-ª½u¢©ð ®Ô‡¢ C†Ïd-¦ï«Õt Ÿ¿£¾ÇÊ¢
œË>-{©ü ƒ¢œË-§ŒÖåXj Æ«-’Ã-£¾ÇÊ
Æ©-J¢-*Ê -'®¾yª½-F-ªÃ-•Ê¢Ñ-
EŸµ¿Õ©Õ «Õ¢Wª½ÕåXj £¾Çª½¥¢
ªÃ-«Õ-ÊoÂ¹× •Êt-C-Ê- ÂÃ-ÊÕ¹
-'FAåXj ªÃª¸îœþ «ÖšÇx-œ¿{¢ £¾É²Äu-®¾pŸ¿¢Ñ-
„çṈ©Õ ¯Ã{ÕŸÄ¢.-.- ®¾¢ª½Â¹~º ÍäX¾-œ¿ÕŸÄ¢
ª½-¹h-ŸÄÊ¢.-.- «“²Äh© X¾¢XϺÌ.-.- ÆÊo-ŸÄÊ¢.-.-
„çṈ©Õ ¦AÂˢ͌ÕÂ¹×¯ä ¦ÇŸµ¿uÅŒ B®¾Õ¹עŸÄ¢
¦µÇN-ÅŒ-ªÃ© «ÕÊÕ-’¹-œ¿Â¹× “X¾A ŠÂ¹ˆª½Ö „çṈ©Õ ¯ÃšÇL: ‡¢XÔ ’¢ Êê’†ý
‚®Ï-¤¶Ä-¦ÇŸþ ®¾ª½p¢-*’à «Õª½Õq-Âî© ®¾ª½-®¾yA
X¾¢ÍÃ-§ŒÕB …Ÿîu-’¹Õ© ªÃ²Äh-ªîÂî
X¾¢ÍÃ-§ŒÕB ®¾«Õ-ª½¢©ð ÅçªÃ-®¾Â¹× ª½—©Âþ
‡®Ôp‡¢ X¾ÛÊ-ª½Õ-Ÿ¿l´-ª½-ºåXj ®¾p†¾d-„çÕiÊ “X¾Â¹-{Ê Í䧌ÖL
B-ª½-ÊÕÊo ¹œç¢ ‚§ŒÕ-¹{Õd éªjŌթ ¹³Äd©Õ.-!
…ÅÃq-£¾Ç¢’à 2ê ª½¯þ
ꇢ®Ô X¾Üª½y NŸÄu-JnÂË ®ÏN©üq ªÃu¢Âþ
«ÕSx X¾K¹~ ªÃ®Ï ‰\-‡®ý ²ÄCµ²Äh: “¬Á«-ºý-¹×-«Öªý
X¶¾ÕÊ¢’à ®ÔÅÃ-ªÃ-«Õ-ªÃV •§ŒÕ¢A
“åXj-„ä{Õ NŸÄu-®¾¢-®¾n© ŸîXÏ-œÎE ÆJ-¹-šÇdL
“X¾¬Ç¢-ÅŒ¢’à ¤òL¢’û
²Ä„Ã-X¾Üªý ®¾ª½p¢-*’à ®¾ÕE©ü
ÊÕ„Ãy.-.-.-¯ä¯Ã.-.-!
'‚ …¤Ä-ŸµÄu-§Œá-©ÊÕ „ç¢{¯ä JM„þ Í䧌ÖLÑ
¯äœ¿Õ ª½•Â¹ ®¾¢X¶¾Õ¢ «Õ£ÏÇ-@Á© ®¾«Ö-„ä¬Á¢
ªÃ¢M©Ç „çÕiŸÄ-Ê¢©ð £¾ÇJ-ÅŒ-£¾Éª½¢
X¾Û†¾ˆ-ª½-X¶¾Ö{x X¾J-Q-©Ê
X¶¾ÕÊ¢’à «Õ¢“A ªÃ«ÕÊo •Êt-CÊ „䜿Õ-¹©Õ
ª½Â¹h-ŸÄÊ¢ Íä®ÏÊ §Œá«-¹שÕ
 
  ÅÃèÇ-„Ã-ª½h©Õ
  “X¾ŸµÄÊ „ê½h©Õ
  “X¾Åäu¹ ¹Ÿ±¿-¯Ã©Õ
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net