మీ ఆరోగ్య సమస్యలను పోస్టుకార్డు మీదే, క్లుప్తంగా,
స్పష్టంగా రాయండి.

సమస్య-సలహా
సుఖీభవ,
ఈనాడు కాంపౌండ్‌,
సోమాజిగూడ,
హైదరాబాద్‌- 500082.

story-1.gif

ఆటలకు... గుండెమీద చెయ్యేసుకుని పంపండి!

Sukhibava-Story.jpg

అప్పటి వరకూ హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగి న బిడ్డలే!  కానీ రెండు వారాల క్రితం.. గణతంత్ర వేడుకల సందర్భంగా బడిలో నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొని.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముక్కుపచ్చలారని ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే కుప్పకూలి మృత్యువాతపడ్డారు.

Full Story

ఆ శారీరక మార్పుల గురించి వివరించారా?
రుతుక్రమం.. ఆడపిల్లలు బాల్యం నుంచి యుక్తవయసులోకి అడుగిడే దశకు సూచన. సాధారణంగా చాలామంది ఆడపిల్లల్లో 10 నుంచి 13 ఏళ్ల మధ్య రుతుచక్రం ప్రారంభమవుతుంది. అయితే కొంతమందికి ఇంతకంటే ముందుగానే.. అంటే దాదాపు 8 ఏళ్ల వయసులోనే లేదంటే 13 ఏళ్ల తర్వాతనైనా.. నెలసరి కావడం మొదలవ్వచ్చు. ఏదేమైనా పిరియడ్ మొదలయ్యే క్రమంలో ఆడపిల్లల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సర్వసాధారణం. తల్లులు ఆ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వాటి గురించి వారికి వివరించడం ఎంతో ముఖ్యం. అంతేకాదు.. ఆయా సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వారికి అన్ని వివరాలు ముందుగానే తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదే.

'వసంతకాలం'లో ఇంటికి వన్నె తీసుకురండిలా..!
వాతావరణం అటు మరీ చల్లగా కాకుండా.. ఇటు మరీ వేడిగా కాకుండా ఆహ్లాదంగా ఉంటుంది. ఎక్కడ చూసినా విరబూసే రంగురంగుల పూలతో చెట్లన్నీ నిండుగా కనిపిస్తుంటాయి. ఈ పాటికే దాదాపు అందరికీ అర్థమై ఉంటుంది.. మేం చెప్పేది 'వసంతకాలం' గురించని.. ఈ కాలంలో పూసే పూలతోనే కాదు.. ఆహ్లాదాన్ని పంచే రంగులతోనూ ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. ఇంటికీ వసంత కళ తీసుకురావచ్చు. మరి త్వరలోనే వసంతం రానున్న ఈవేళ ఆ కాలంలో ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం రండి..

cinema-300-50.gif
sthirasthi_300-50.gif