Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


విష్ణువుకు ముమ్మారు జన్మనిచ్చిన దంపతులు
దృష్టమంటే సాక్షాత్తూ వైకుంఠవాసుడినే నవమాసాలపాటు తన గర్భాన మోసిన దేవకిది, ఆ బిడ్డకు తండ్రి అయిన వసుదేవుడిదే. అసలా అద్భుతం ఎలా సాధ్యమైందనే విషయాన్ని వివరించే కథాసందర్భం ఇది. భాగవతం దశమస్కంధం పూర్వార్థంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. దేవకీవసుదేవులకు తాను ఎందుకు జన్మించాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి వైకుంఠవాసుడే స్వయంగా వివరించి చెప్పాడు. వసుదేవుడిని, దేవకిని కంసుడు చెరసాలలో బంధించాడు. దేవకికి ఎనిమిదోసారి గర్భం వచ్చింది. ఆ అష్టమ గర్భాన జన్మించినవాడే తన ప్రాణాంతకుడని, ఆ బిడ్డ పుట్టీపుట్టగానే సంహరించాలని కంసుడు ఎదురుచూస్తున్నాడు. మరో పక్క దేవకీవసుదేవులు ప్రసవ సమయం దగ్గరపడిందని గ్రహించి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు. ప్రసవమైన మరుక్షణం దేవకీదేవి కుమారుడిని చూసింది. మహాపురుష లక్షణాలు అతడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతలోనే కంసుడు గుర్తొచ్చి నిలువెల్లా వణికిపోయింది. మళ్లీ అంతలోనే ధైర్యం తెచ్చుకొని చిరునవ్వుతో ఆ బాలకృష్ణుడిని చూసి స్తుతించింది. ప్రళయకాలంలో విశ్వాన్నంతటినీ తన పొట్టలో దాచుకొనే ఆ విరాట్‌పురుషుడు తన కడుపున పుట్టడం పరమాద్భుతమైన భగవంతుడిలీల కాక మరొకటి ఏదీ కాదు అని అనుకొంది.

మోక్షాన్ని మరిచి, సంతానాన్ని కోరి..!
దేవకీదేవి స్తోత్రం విని శిశురూపంలో ఉన్న శ్రీహరి దేవకీవసుదేవులతో ఇలా అన్నాడు. పూర్వజన్మలో స్వాయంభువ మన్వంతరంలో తొలిగా పృశ్ని అనే పేరున దేవకి, సుతపుడు అనే పేరున వసుదేవుడు జన్మించారు. అప్పుడా ఇద్దరు దంపతులను బ్రహ్మ సంతానాన్ని కనమన్నాడు. కానీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొన్న ఆ దంపతులిద్దరూ వైకుంఠంలోని శ్రీమహావిష్ణువు గురించి కఠోరంగా తపస్సు చేశారు. ఆ ఇద్దరి తపస్సు, శ్రద్ధ, ప్రేమ, భక్తి విష్ణువును ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంత తీవ్రంగా తపస్సు చేస్తున్న ఆ దంపతులను అనుగ్రహించాల్సిందేనంటూ విష్ణువు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడా దంపతులిద్దరూ బ్రహ్మదేవుడు మమ్మలిద్దరినీ సంతానం కనమని ఆజ్ఞాపించాడు. మాకు అలాంటి ఇలాంటి వారెవరూ సంతానంగా అక్కరలేదు. మాకు బిడ్డంటూ పుడితే అచ్చంగా రూపంలోనూ, గుణాలలోనూ నీలా ఉండే వాడే పుట్టాలని ఆ దంపతులు కోరుకున్నారు. విష్ణువంతటివాడు ప్రత్యక్షమైతే మోక్షాన్ని కాక సంతానాన్ని కోరుకోవటమనేది విష్ణుమాయ వల్లే జరిగింది. ఆ జరగటమనేది భవిష్యత్తులో ధర్మోద్ధరణ కోసమే. ఆ ఇద్దరు దంపతుల కోరికను విని రూపంలోనూ, గుణాలలోనూ తనను పోలినవాడు సృష్టిలో మరొకడు లేడు. కనుక తానే పృశ్ని గర్భాన జన్మించి వారి కోరిక తీరుస్తానని వరమిచ్చాడు. ఆ మాట మేరకు ప్రశ్ని కడుపున బిడ్డగా జన్మించాడు. అప్పుడాయన పేరు పృశ్నిగర్భుడు.

వామనుడూ ఆయనే..!
పృశ్ని, సుతపుడు మరుసటి జన్మలో కూడా దంపతులే అయ్యారు. అప్పుడు వారు అదితి, కశ్యపుడు అనే పేరున జన్మించారు. ఆ జన్మలో కూడా అదితి, కశ్యపులు దైవికంగా విష్ణువే తమకు బిడ్డగా పుట్టాలని తపస్సు చేశారు. తపస్సు కూడా విష్ణువుకు ఎంతగానో నచ్చింది. అందుకే ఆ జన్మలో కూడా అదితి కడుపున వామనుడిగా జన్మించాడు విష్ణువు. ఆ వామనుడి పేరే ఉపేంద్రుడు. మరుగుజ్జులాగా పొట్టిగా ఉన్నాడు కనుక వామనుడు అని అందరూ పిలిచారు. అదితీ కశ్యపుల మరుజన్మ దేవకీవసుదేవులు. ఆ జన్మలోనూ ఆ ఇద్దరూ త్రికరణశుద్ధిగా శ్రీమహావిష్ణువుకు భక్తులై ఉండి ఆయనే తమకు బిడ్డగా జన్మించాలని నిరంతర నిర్మలభక్తితో కోరుకున్నారు. ఆ భక్తికి వసుడయ్యే విష్ణువు దేవకి కడుపున తాను జన్మించినట్టు దేవకీవసుదేవులకు చెప్పాడు. అలా ఆ ఇద్దరు దంపతులదే అదృష్టమైంది. ఆ అదృష్టం వారికి కలగటానికి ప్రధాన కారణం నిశ్చలమైన నిర్మలభక్తితో ఆ వైకుంఠవాసుడిని ఆరాధించటమే. అంతటి భక్తితత్పరత ఆరాధనలతో ఆ స్వామిని సేవిస్తే అలాంటి అదృష్టం ఏ భక్తులకైనా కలుగుతుందని తెలియచేస్తోంది ఈ కథా సందర్భం.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net