Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


ప్రాణి పుట్టుక, జీవనగతి ముందే సిద్ధం
ప్రాణి జన్మించటం, జీవనం సాగించటం అనే లాంటి విషయాలన్నీ ఎంతో ముందుగానే దైవం నిర్ణయించి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంటుంది. అంత గొప్ప పథక రచన జననజీవన క్రమంలో ఉంటుందనటానికి ఓ ఉదాహరణ మార్కండేయ పురాణం మొదటి అధ్యాయంలోని వపువు శాప కథనం అనే ఈ కథాసందర్భం. దూర్వాస మహర్షి తపస్సును చెడగొట్టిన వారే సమర్థులైన అప్సరసలు అని నారదుడు ఓ రోజున స్వర్గంలో నందనవనంలో ఇంద్రుడి ఎదుట ప్రకటించాడు. ఆ ప్రకటన విని అక్కడున్న గొప్ప గొప్ప అప్సరసలందరూ వెనకడుగేశారు. కానీ వపువు అనే అప్సరస మాత్రం కొద్దిపాటి గర్వంతో, అందుకు తానే సమర్థురాలినంటూ దూర్వాసుడి దగ్గరకు వెళ్లి తపస్సుకు భంగం కలిగించింది. అందుకు ప్రతిగా దూర్వాసుడు పక్షిగా జన్మించమని ఆమెను శపించాడు.

పక్షిపై కత్తిదూసిన రాక్షసుడు..
వపువు ఆ జన్మను చాలించి పక్షిగా జన్మించాలంటే తల్లిదండ్రుల స్థానంలో మరో రెండు పక్షులుండాలి. అందుకు దైవం అప్పటికే మరొక విచిత్రమైన పథకాన్ని రూపొందించి ఉంచింది. జరగబోయే కార్యాలకు రంగాన్ని సిద్ధం చేసి ఉంచింది. ఆ రోజుల్లో గరుత్మంతుడి వంశంలో జన్మించిన సుప్రసిద్ధులైన ఇద్దరు పక్షి సోదరులుండేవారు. అందులో కంకుడు పెద్దవాడు. కంధరుడు చిన్నవాడు. ఆ ఇద్దరు సోదరులు ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఓ రోజున కంకుడు విహారానికి కైలాస పర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కుబేరుడి అనుచరుడైన విద్యుద్రూపుడు అనే ఓ రాక్షసుడు తన భార్యతో విహరిస్తూ ఉన్నాడు. కంకుడిని చూడగానే విద్యుద్రూపుడు తన సహజసిద్ధమైన క్రూరత్వాన్ని ప్రదర్శిద్దామనుకున్నాడు. ఆ పర్వత ప్రాంతంలో తాను విహరిస్తున్నప్పుడు ఓ సామాన్య పక్షి తానున్న ప్రదేశంలో తిరగటమేమిటి అనే ఓ అనవసరమైన, అసందర్భమైన కోపభావం అతడిలో చెలరేగింది. వెంటనే కుంకుడిని పిలిచి దురుసుగా మాట్లాడాడు. అప్పుడు కంకుడు నిదానంగా, శాంతంగానే ఆ ప్రదేశం విద్యుద్రూపుడు ఒక్కడికి మాత్రమే సంబంధించింది కాదని, దానిమీద తిరిగే అర్హత తనలాంటి ప్రాణులన్నిటికీ కూడా ఉందని చెప్పాడు. ఆ మాటలను విన్న విద్యుద్రూపుడికి పట్టరాని కోపం కలిగింది. వెంటనే కంకుడిపైకి కత్తిదూసి సంహరించాడు. ఈ విషయం కంకుడి సోదరుడైన కంధరుడికి తెలిసింది. వెంటనే విద్యుద్రూపుడు ఎక్కడున్నాడో వెతికి తెలుసుకున్నాడు.

అలా ముందే నిర్ణయమై ఉంటుంది!
కంధరుడు విద్యుద్రూపుడి దగ్గరకు వెళ్లేసరికి అతడు తన భార్య అయిన మదనికతో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కంధరుడిని చూడగానే ఆ రాక్షసుడికి విషయం అర్థమైంది. తన సోదరుడు కంకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి కంధరుడు వచ్చాడని, కనుక తాను వెంటనే ప్రతిస్పందించాలని అనుకొని తన సైన్యంతో సహా కంధరుడిని ఎదుర్కొన్నాడు. కానీ ఆ యుద్ధంలో కంధరుడే గెలిచాడు. విద్యుద్రూపుడు మరణించాడు. అప్పటి సామాజిక న్యాయం ప్రకారం విద్యుద్రూపుడి భార్య మదనికను కంధరుడు తన భార్యగా చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. రాక్షస వంశంలో జన్మించిన మదనికకు స్వేచ్ఛగా ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించే శక్తి ఉంది. దాంతో ఆమె కంధరుడు అనే పక్షిరాజుకు భార్య అయింది కనుక తాను కూడా పక్షి రూపాన్నే ధరించి కంధరుడితో కలిసి జీవించసాగింది. అలా ఆ పక్షి దంపతులకు దూర్వాసుడి శాపంవల్ల పక్షిగా జన్మించాల్సిన వపువు అనే అప్సరసకు పక్షిజన్మకు సంబంధించిన వేదిక సిద్ధమైంది. కంధరుడు, మదనిక అనే ఆ పక్షి దంపతులకు వపువు పక్షిగా జన్మించింది. ఈ కథను గమనిస్తే దైవం ఓ ప్రాణి పుట్టుక, జీవనగతికి సంబంధించిన పరిస్థితులన్నింటినీ ఎంతో ముందుగానే ఏర్పాటు చేసి ఉంటుందనే ఓ భావన మదిలో మెదులుతుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net