Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu


ఏ సందర్భంలో ఏ నామాన్ని స్మరించాలి?
భారతావని సంప్రదాయబద్ధంగా యుగయుగాలుగా తరతరాలుగా ఆస్తికభావంతో దేవుడున్నాడు రక్షించి తీరుతాడు అనే నమ్మకంతో ముందుకు సాగుతుండటం కనిపిస్తుంటుంది. పురుష ప్రయత్నం ఎంతగా ఉన్నా దానికి దైవం అనుకూలిస్తే తప్ప విజయం చేకూరదనే విశ్వాసం కూడా సమాజమంతటా బాగా విస్తరిల్లి ఉంది. ఈ కారణం చేతనే విశ్వవ్యాపకుడైన విష్ణువును స్మరిస్తూ ఆస్తికులు అనేకానేక కార్యాలను నిర్వర్తిస్తూ ఉండటం కూడా జరుగుతోంది. విష్ణువు అనే విషయంలో మతాలకతీతంగా దైవం అనేదే ఇక్కడ ప్రకటితమవుతున్న విషయం. విష్ణువుకు, శివుడికి భేదం లేదని ప్రకృతీపరమేశ్వరులిద్దరూ ఒకటేనని నిరూపించే పురాణ ఇతిహాస సంబంధమైన అంశాలు, కథలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఈ కథా సందర్భం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేటప్పుడు, అలాగే ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు దైవానికి సంబంధించిన ఏ నామాన్ని స్మరించుకోవాలి, ఎప్పుడు ఏ నామాన్ని జపించినందువల్ల విజయాలు కలుగుతాయనే విషయాలను వివరిస్తుంది. ఇలాంటి ఈ కథా సందర్భం విష్ణుధర్మోత్తర పురాణం తృతీయ ఖండం నూట ఇరవైరెండో అధ్యాయంలో ఉంది. మార్కండేయ మహాముని ఈ విషయాలన్నీ వివరించి చెప్పాడు.

ప్రయాణానికి ముందు తల్చుకోవాల్సిన నామాలు..
వూరికి బయలుదేరేప్పుడు క్షేమాన్ని కోరుకునేవారు తన చుట్టూ ఉన్న నాలుగు దిక్కులలోనూ చక్రి, హలి, సారంగి, ఖడ్గి అనే నాలుగు పేర్లను స్మరించాలి. ఇక్కడ చెప్పిన నాలుగు పేర్లలో రెండోపేరు హలి అనే పదం హలాయుధుడు అనే అర్థానిస్తుంది. హలం అంటే నాగలి అని అర్థం. ఆ నాగలిని ఆయుధంగా ధరించిన బలరాముడిని, సారంగం అనే ధనువును ధరించి ఉండే విష్ణువును, ఖడ్గధారి అయిన విష్ణువును, అన్నిటికంటే ముందు సుదర్శనం అనే చక్రాన్ని ధరించి ఉండే చక్రి అయిన విష్ణువును స్మరించటం ఎంతో క్షేమదాయకమన్నాడు మార్కండేయుడు. ఏదైనా వ్యవహారంలో విజయం పొందాలని పనులు ప్రారంభించేటప్పుడు భక్తితో సర్వేశ్వరుడిని స్మరించాలి. జలప్రవాహాలను దాటేటప్పుడు మత్స్య, కూర్మ, వరాహా నామాలను తలచుకోవాలి. అగ్నిని కోరుకొనేటప్పుడు భ్రాజిష్ణు నామాన్ని స్మరించాలి. అగ్నిని కోరుకోవటమేమిటి అనే సందేహం కొంతమందికి కలుగుతుంది. యజ్ఞయాగాల సమయంలో అరణిని మధించేటప్పుడు ఆ భ్రాజిష్ణు కృప లేకపోతే అగ్ని ఉద్భవించదు. దీపారాధన సమయంలో కూడా అగ్నిని కోరుకోవటం జరుగుతుంది. అలాంటి సమయంలో భ్రాజిష్ణు అనే దైవనామాన్ని స్మరించాలి. యుద్ధానికి బయలుదేరినప్పుడు అపరాజితుడైన రాముడిని వస్తు సమృద్ధి, ధన సమృద్ధిలాంటివి కావాలనుకొని పనులు ప్రారంభించేటప్పుడు కేశవ, పుండరీకాక్ష అని స్మరించాలి. నేత్రబాధలు తగ్గేందుకు కావలసిన పనులను ప్రారంభించేటప్పుడు హృషీకేశ అనే నామాన్ని స్మరించాలి.

అచ్యుత అంటే రోగనిర్మూలన...
రోగనిర్మూలన కోసం తగిన ఔషధాన్ని తీసుకొనేటప్పుడు అచ్యుత, అమృత అని తలచుకోవాలి. ఆపదలు సంభవించినప్పుడు వాటి విముక్తికి తగిన పనులను ప్రారంభించేటప్పుడు గరుడధ్వజ అనే పేరును స్మరించాలి. ఇదే గరుడధ్వజనామం జ్వరం, పార్శ్వనొప్పులు, విషబాధలు తగ్గేందుకు ప్రయత్నం చేసే ముందు స్మరించటం వల్ల కూడా ఎంతో మేలు కలుగుతుంది. గ్రహ, నక్షత్ర బాధలు, దైవిక ఉత్పాతాలు, అరణ్యంలో దొంగలు, శత్రువుల బాధలు తొలగేందుకు చేసే ప్రయత్నాలకు ముందు, విఘ్నాలు కలుగుతున్నప్పుడు, సింహాలు, పులులలాంటి క్రూరజంతువుల వల్ల బాధలు కలుగుతున్నప్పుడు, దిక్కులు దారితోచని గాడాంధకార సమయంలో నరసింహ నామ సంకీర్తనం క్షేమప్రదం. ధనాన్ని భద్రంగా దాచిపెట్టే ముందు, ధాన్యాన్ని గాదెలలో పోసేటప్పుడు మనస్సును పరమేశ్వరుడి మీద నిలిపి అచ్యుత, అనంత అనే నామ సంకీర్తనను చేయాలి. పీడ కలలు వచ్చినప్పుడు నారాయణ, సారంగధర, శ్రీధర, గజేంద్రమోక్షణ, వామన ఖడ్గధరి అనే నామాలను స్మరించాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు జలశయన, క్షీరసాగరశయన అనే వైకుంఠవాసుడి నామాలను స్మరించాలి. ధన సంమృద్ధి కావాలనుకున్నప్పుడు బలభద్ర అని, వ్యవసాయాన్ని ప్రారంభించేటప్పడు హలాయుధ అని, వర్తకంలో లాభాలు రావాలనుకున్నప్పుడు ఉత్తారణ అనే పేర్లను జపించటం వల్ల మేలు కలుగుతుంది. అభ్యుదయం కోరుకొనేవారు శ్రీః అనే పేరును, మంగళ్య, మంగళ అనే పేర్లను, అమంగళకార్య సమయాలలో శోకాలు, అరిష్టాలలాంటివి తొలగేందుకు కూడా మంగళ్య, మంగళ అనే నామాలను స్మరించటం మేలు. నిద్ర నుంచి లేచేటప్పుడు విష్ణు అనే నామాన్ని, నిద్రపోబోయే ముందు మాధవనామాన్ని, భోజనానికి ముందు గోవింద అనే నామాన్ని, ఇతరత్రా అన్ని సందర్భాలలోనూ మధుసూదన అనే నామాన్ని, కీర్తించటం వల్ల మేలు కలుగుతుంది. తుమ్మినప్పుడు, జారిపడినప్పుడు, ఆవులింత వచ్చినప్పుడు, పరగడుపున ఉన్న సమయంలో, స్నానం, దేవతార్చనం, హోమం, సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణంలాంటివి చేసేటప్పుడు వాసుదేవ అనే నామాన్ని సంకీర్తించాలి. ఇలా ఒక్కొక్క పని ప్రారంభానికి ముందు భగవంతుడికి సంబంధించిన ఒక్కొక్క ప్రత్యేక నామాన్ని స్మరించటం వల్ల కార్యజయం కలుగుతుందని చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వజ్రుడికి చెప్పాడు. ఈ వజ్రుడు శ్రీకృష్ణుడికి మనుమడు. అంటే ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడికి ఉష వల్ల జన్మించాడు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net