Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu


కైలాస నాథుడి పట్టాభిషేక మహోత్సవం
కెలాసనాథుడైన పరమేశ్వరుడికి పార్వతితో కల్యాణం జరగటం వరకూ అందరికీ బాగా పరిచయమైన విషయమే. అయితే సృష్టి, స్థితి, లయకారకులలో లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి కూడా మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటి విశేషాలను గురించి వివరిస్తోంది శివమహాపురాణం రుద్రసంహిత ఇరవయ్యో అధ్యాయం. సత్యలోకంలో బ్రహ్మదేవుడు, వైకుంఠంలో శ్రీమహావిష్ణువు తమ తమ పరివారాలతో గొప్పగా కొలువుతీరి ఉన్నారు. అయితే శ్మశానవాసిగా, గజ చర్మాంబరధారిగా, నిరాడంబరుడిగా ఉండే బోళాశంకరుడికి కూడా కైలాస పర్వతం మీద పట్టాభిషేకం జరగాలన్నది దైవసంకల్పం. ఆ సంకల్పమే పరమేశ్వర సంకల్పం కూడా. ఈశ్వరుడు కొలువుతీరి ఉండే కైలాసగిరికి సమీపంలో శివ మిత్రుడైన కుబేరుడు అలకాపురిలో రాజ్యపాలన సాగిస్తూ యక్షరాజుగా, ధనపతిగా పూజలందుకొంటున్నాడు. మరలాంటప్పుడు ఈశ్వరుడికి కూడా తగిన విధమైన సౌధాలు, సౌకర్యాలు ఉండితీరాలి. జగజ్జనని పార్వతి కూడా అలా ఉంటే బాగుండునని సంకల్పించుకొంది. అలా పార్వతీ పరమేశ్వరుల సంకల్పం శివపట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ త్వరత్వరగా అక్కడ జరిగేందుకు దోహదపడింది. దైవసంకల్పం సకల దేవతలకు, మునులు, రుషులు అందరికీ సందేశంగా చేరింది.

డమరుక నాదమే ఆహ్వానం..
పరమేశ్వరుడు నాదస్వరూపిణి అయిన తన డమరుకాన్ని మోగించి ఆ డమరుక నాదంతోనే లోకాలన్నిటికీ పట్టాభిషేక ఆహ్వానాన్ని పంపాడు. ఆ ఆహ్వానాన్ని అందుకుని ఎందరెందరో దేవతలు, రుషులు, మునులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. ఇదంతా ఓ ఎత్తయితే శివుడి దగ్గరుండే ప్రమథ గణాలు తరలివచ్చిన తీరే ఆనాడు అద్భుతంగా కనిపించింది. ఆ ఆహ్వానాన్నందుకొని శంఖకర్ణుడు తన అధీనంలో ఉండే కోటి గణాలతోనూ, కేకరాక్షుడు పదికోట్ల గణాలతో, వికృతుడు ఎనిమిదికోట్ల గణాలతో, విశాఖుడు అరవైనాలుగు కోట్లు, పారియాత్రకుడు తొమ్మిదికోట్లు, సర్వాంతకుడు ఆరుకోట్లు, దుందుముడు ఎనిమిది కోట్ల మందితో తరలివచ్చాడు. అదేవిధంగా వికృతాననుడు ఏడు కోట్లు, కపాలి అయిదు కోట్లు, సందారకుడు ఆరుకోట్లు, కండుకుడు, కుండకుడు చెరొక కోటి గణాలతోనూ, విష్టంభుడు ఎనిమిదికోట్లు, చంద్రతాపసుడు ఎనిమిదికోట్లు, మహాకేశుడు వేయికోట్ల గణాలతోనూ కైలాసానికి తరలివచ్చారు. వీరితోపాటు కుండి, పర్వతకుడు చెరొక పన్నెండుకోట్ల గణాలతోనూ, కాలుడు, కాలకుడు, మహాకాలుడు ముగ్గురూ నూరేసి కోట్ల గణాలతోనూ వచ్చారు. అగ్నికుడు వందకోట్లు, అభిముఖుడు కోటి గణాలతోనూ, ఆదిత్యమూర్ఖుడు, ధనావకుడు చెరొక కోటి గణాలతో, సన్నాహుడు, కుమదుడు నూరేసి కోట్ల గణాలతోనూ, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు కోటి కోటి గణాలతో, కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు అరవై కోట్ల గణాలతోనూ, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు తొమ్మిదేసి కోట్ల గణాలతోనూ బయలుదేరి వచ్చారు. నీలుడు, పూర్ణభద్రుడు చెరొక తొంభై కోట్ల గణాలతోనూ, చతుర్వక్తృడు ఏడుకోట్ల గణాలతోనూ, కాష్ఠాగూఢుడు, సుకేశుడు, వృషభుడు చెరి అరవైనాలుగు కోట్ల గణాలతోనూ, చైత్రుడు, నకువశుడు ఏడేసి కోట్ల గణాలతోనూ, లోకాంతకుడు, చైత్యాంతకుడు, భృంగి, ఉరిటి, అశనిభానుకుడు అరవై నాలుగుకోట్ల గణాలతోనూ, గణాధీశుడైన నందీశ్వరుడు శతకోటి గణాలతోనూ, ఇంకా అనేక గణాలవారు అక్కడికి విచ్చేశారు. వీరంతా వేయి చేతులు, జటామకుటాలను ధరించి వచ్చారు.

శివ గణాలంతా ఒకే అలంకారంలో..
అందరూ శివుడికి లాగానే శిరస్సున చంద్రరేఖలు, నల్లని కంఠాలు, త్రిలోచనాలు, హారకుండల కేయూరాది అలంకారాలు ధరించి ఉన్నారు. వీరందరితోపాటు బ్రహ్మా, విష్ణు తదితర దేవతలంతా కైలాసానికి వచ్చారు. వచ్చిన దేవతలు, రుషులు, శివగణాలందరికీ శివుడి మిత్రుడు కుబేరుడు సాదరంగా స్వాగతం పలికాడు. ఎవరెవరికి ఏ విధమైన మర్యాదలు, సౌకర్యాలు అందాలో అన్నిటినీ దగ్గరుండి పర్యవేక్షించాడు. అప్పటికే శివసంకల్పంతో శివుడి కోసం, అక్కడికొచ్చిన అతిథుల కోసం కైలాస పర్వతం మీద శివాజ్ఞతోనే విశ్వకర్మ అద్భుతమైన భవనాలు నిర్మించాడు. ఇంతలో నారాయణుడు పరమేశ్వర పట్టాభిషేకానికి సమయం దగ్గరవుతుందని గ్రహించి అక్కడికొచ్చి మిగతా ఏర్పాట్లన్నీ చేయించాడు. శివుడికి గొప్ప వేడుకగా బ్రహ్మదేవుడు పట్టాభిషేక ఉత్సవాన్ని జరిపించాడు. పట్టాభిషిక్తుడైన శివుడిమీద పుష్పవృష్టి కురిసింది. అప్సరసలు శివలీలా విలాసాన్ని గానం చేస్తూ, నాట్యం చేశారు. జయజయధ్వానాలు, ఓం నమశ్శివాయ శబ్దాలు మిన్నంటాయి. అలా పట్టాభిషేకం ముగిశాక శివుడు బ్రహ్మ, విష్ణు తదితరులను గొప్పగా సత్కరించాడు. అక్కడికొచ్చిన వారంతా వారికి తగిన సత్కారాలను అందుకొని ఆనందంగా శివసంకీర్తన చేస్తూ తమ తమ నెలవులకు చేరారు. ఇలా ఎంతో వైభవంగా శివపట్టాభిషేకం జరిగిందని వివరించే ఈ కథాసందర్భంలో శివుడి ప్రమథ గణాలలో ఉండే కొందరి ముఖ్యుల పేర్లు, వారి అధీనంలో ఉండే కోటానుకోట్ల శివగణాల వివరాలు కూడా కనిపిస్తున్నాయి.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net