Mon, February 15, 2016

Type in English and Give Space to Convert to Telugu


కోరికలపై కాంక్ష.. ముక్తిమార్గానికి ఆంక్ష!
క్కోసారి అదృష్టం వచ్చి తలుపు తట్టినా అదేదో గాలి తాకిడికి తలుపు చేసిన శబ్దమేమో అనే భ్రమ కలుగుతుంటుంది. భగవంతుడే తోటి మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తున్నా వచ్చినవాడు మోసగాడేమోనని అనుమానం కలిగి ఆ సాయాన్ని తిరస్కరించే పరిస్థితులూ ఎదురవుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంటుంది? అనే సందేహం చాలామందిలో కలగటం కూడా సహజమే. ఇటువంటి సందేహాలకు మహాభాగవతం బహుచక్కని సమాధానాలనిస్తోంది. భాగవతంలో ఉన్న అటువంటి సమాధానాత్మక ఘట్టాలలో ఓ చక్కని ఘట్టమిది. మహాభాగవతం దశమస్కంధం పూర్వభాగంలో ఈ ఘట్టం కనిపిస్తుంది. ఓ రోజున బాలకృష్ణుడు తోటి గోపకులను తీసుకొని వనానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయమైంది. అందరికీ ఆకలైంది. వెంట చద్ది తెచ్చుకోలేదు. ఆ పరిస్థితిని చూసి కృష్ణుడు గోపకులకు ఓ ఉపాయం చెప్పాడు. ఆ సమీపంలోనే బ్రహ్మవాదులైన విప్రులు స్వర్గసుఖాలను పొందటం కోసం అంగిరసం అనే ఓ మహాయజ్ఞాన్ని చేస్తున్నారు. అక్కడకు వెళ్లి తన పేరు చెప్పి గౌరవపూర్వకంగా అడిగితే వారు భోజనం పెడతారన్నాడు.

గోపాలకులను చులకనచేసిన విప్రులు
కృష్ణుడు చెప్పినట్లే గోపకులు యజ్ఞం జరిగే చోటుకు వెళ్లి అక్కడున్న విప్రులకు తాము కృష్ణుడి దగ్గర నుంచి వస్తున్నామని, తమకు భోజనం పెట్టమని అడిగారు. అయితే వారు భగవన్మాయలోపడి గోపకులను పంపించింది సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్ముడే అని గ్రహించలేక భక్తిహీనత వల్ల గోపకుల కోరికను తిరస్కరించారు. కృష్ణుడు సర్వేశ్వరుడు. మంత్రతంత్రాలు, సంపదలు, కాలము, దేశము, దైవం, ధర్మం ఇలాంటివన్నీ ఆ మహాత్ముడి స్వరూపాలే. వాస్తవానికి అంగిరస అనే ఆ యజ్ఞం చేస్తున్నవారంతా తమ కోరిక అయిన స్వర్గ సుఖం మీద దృష్టిని నిలిపారే కానీ తమ కళ్లెదుటే భగవంతుడున్నాడని, ఆయనే గోపకులను పంపి తమకు మోక్షాన్ని ఇవ్వటం కోసం అన్నాన్ని అర్థిస్తున్నాడని గ్రహించలేకపోయారు. దీనికి కారణం వారికి భగవంతుడి మీదకన్నా తమ కోరిక మీదే భక్తి, ధ్యాస ఎక్కువగా ఉండటం. దాంతో జగన్నాయకుడైన కృష్ణుడిని సామాన్య గోపబాలకుడిగా భావించి తమ దగ్గరకొచ్చిన గోపాలకులను చులకనచేసి తిరస్కరించారు. గోపాలకులు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పారు. ఆ మాటలను విన్న కృష్ణుడు ఈసారి ఆ యజ్ఞం చేస్తున్నవారి పత్నుల దగ్గరకు వెళ్లి అడగమన్నాడు. గోపబాలకులు కృష్ణుడు చెప్పినట్లే చేశారు. యజ్ఞం చేస్తున్నవారి పత్నులు ఏనాటి నుండో కృష్ణుడి మీద భక్తితో కృష్ణుడిని చూడాలన్న కుతూహలంతో ఉన్నారు. గోపబాలకుల మాటలు విని వారంతా ఎంతో ఆనందోత్సాహాలకు లోనయ్యారు. వెంటనే రుచికరమైన భక్ష్య, భోజ్యాలతో, కమ్మని పచ్చళ్లతో, పులుసులు, రుచికరమైన పానీయాలతో కూడిన ఆహారపదార్థాలను పాత్రలలో పెట్టుకొని కృష్ణుడి దగ్గరకు బయలుదేరారు.

కృష్ణుడిని చూసి ఆనందించిన మునుల పత్నులు
ఎవరు అడ్డుపడ్డా లెక్కచేయకుండా జగన్నాయకుడైన కృష్ణుడిని చూడాలన్న భక్తికాంక్షతో వారంతా బయలుదేరి కృష్ణుడున్న ప్రదేశానికి వచ్చారు. మునుల పత్నులు ఆహారపదార్థాలను తెచ్చే సమయానికి బాలకృష్ణుడు పక్కనే ఉన్న ఒక చెలికాడి మీద చెయ్యివేసి రెండో చేత్తో ఒక పద్మాన్ని విలాసంగా తిప్పుతూ కనిపించాడు. ఆయన ముఖం మీది ముంగురులు గాలికి మెల్లమెల్లగా కదలాడుతున్నాయి. ఆయన ధరించిన పట్టు పీతాంబరం చిన్నచిన్న కుచ్చులతో అందంగా కనిపిస్తోంది. ఆ స్వామి తలచుట్టూ నెమలిపింఛపు దండ అందంగా అలంకరించి ఉంది. ఆ స్వామి చెవులపై కలువపూవులు కళకళలాడుతున్నాయి. లేలేత చిగుళ్లు చక్కటి పుష్పాలతో అల్లిన హారాలు ఆయన మెడలో ఉన్నాయి. సమ్మోహనకరమైన కృష్ణుడి ఈ స్వరూపాన్ని మునిపత్నులు కళ్లారా చూసి ఆనందించారు. తమ హృదయాలలో ఉన్న తాపం అంతా తీరేలాగా కృష్ణుడిని మనసారా కీర్తించారు. సంసారపు జంజాటాలను అన్నింటినీ తోసిపుచ్చి తనను దర్శించటం కోసం వచ్చిన మునిపత్నులను ఆ స్వామి అనుగ్రహించాడు. వారు తెచ్చిన భోజనపదార్థాలన్నింటినీ స్వీకరించి తన తోటి గోపబాలకులందరికీ పెట్టాడు. అందరికీ భిక్షపెట్టే ఆ కృష్ణుడే తన మీద భక్తి తప్ప మనసులో మరేమీ లేని మునుల పత్నులకు మోక్షాన్ని ప్రసాదించటం కోసం తానే స్వయంగా వారి దగ్గర నుంచి భిక్షను స్వీకరించాడు. ఆ తర్వాత వారందరినీ ఇంటి దగ్గర జరుగుతున్న అంగిరస యజ్ఞానికి సహకరించండని పంపాడు. తమ పత్నులు కృష్ణుడి దగ్గర నుంచి తిరిగివచ్చాక మునులకు తాము చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది. తమలాగా వేదాధ్యయనం చెయ్యకపోయినా, తపస్సులు చెయ్యకపోయినా కేవలం మనసు నిండా ఉన్న భక్తివల్లనే తమ పత్నులు మాయకు దూరంగా ఉండి జగన్నాయకుడైన కృష్ణుడి అనుగ్రహాన్ని పొందారని వారు తెలుసుకొని అప్పటి నుంచి నిశ్చలభక్తి మార్గంలో నడుచుకున్నారు. ఇలా ఈ కథాసందర్భం నిశ్చలభక్తి ఉన్నప్పుడు మాయ దరిచేరదని ప్రకటిస్తూ కనిపిస్తుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net