Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu


అంతం లేని దానికోసం ఆరాటం
నిషి వ్యథ చెందినా, చిక్కుల్లో పడ్డా దానికి కారణం ప్రధానంగా ఒకటే కనిపిస్తుంది. అదే అమితంగా ఆశపడటం. ఆశ అనేదానికి అంతంలేదన్న విషయాన్ని అనుభవజ్ఞులు ఎందరెందరో నిగ్గుతేల్చి చెప్పారు. ఇలా చెప్పిన వారిలో యయాతి మహారాజు కూడా ఒకరు. ఈ విషయాన్ని వివరించి చెప్పే ఈ కథా సందర్భం పద్మపురాణం డెభ్బైఏడో అధ్యాయంలో కనిపిస్తుంది. యయాతి తన ధర్మబద్ధమైన పరిపాలనతో, దైవనామ సంకీర్తన బలంతోనూ తన జీవితాన్ని, రాజ్యాన్ని స్వర్గమయం చేసుకున్నాడు. దైవబలంతో ఆయన ఆయువు కూడా పెరిగింది. మానవ జన్మ ఎంత వరకు గడపాలో అంతవరకూ హాయిగా గడిపావు కదా ఇక జీవితం చాలించి స్వర్గానికొచ్చి అక్కడ స్వర్గసుఖాలను అనుభవించమని దేవేంద్రుడు ఆహ్వానం పంపినా తన జీవితం మీద, భూలోకంలో తాను అనుభవిస్తున్న సాంసారిక సుఖాల మీద ఆశ తగ్గని యయాతి స్వర్గసుఖం తనకు అక్కరలేదని తిరస్కరించాడు. తాను పెళ్లాడిన శర్మిష్ఠ, దేవయానిలతో తాను కోరుకున్నట్టు కాలం గడపసాగాడు.

పెళ్లికి షరతులు విధించిన యువతి
ఇంతలో ఓసారి వేటకు వెళ్లినప్పుడు రతీదేవి కుమార్తె అశ్రుబిందుమతి కనిపించింది. అప్పుడు ఆ రాజు మనసులోని కోరికలు ఇంకా ఇంకా పెరిగాయి. అశ్రుబిందుమతి గురించి ఆమె చెలికత్తె విశాల చెప్పిన విషయాలన్నింటినీ తెలుసుకొని ఎలాగైనా సరే ఆ యువతినే పెళ్లాడాలని నిశ్చయించుకొన్నాడు. ఆ విషయాన్నే ఆమె చెలికత్తె విశాల చేత ఆ యువతికి చెప్పించాడు. తాను ఎంత గొప్పరాజో, తనకు ఎంత గొప్ప గొప్ప సంపదలున్నాయో వాటన్నిటినీ తెలియచెప్పి తనను వివాహమాడమని అశ్రుబిందుమతిని యయాతి కోరాడు. కానీ ఆమె ఒక్క నిట్టూర్పుతో ఆ రాజు విజ్ఞాపనను తోసిపుచ్చింది. దానికి కారణమేమిటో తన చెలికత్తెకు చెప్పి దాన్ని రాజుకు వివరించమంది. రాజ్యం ఉండవచ్చు, భోగభాగ్యాలు ఉండవచ్చు. కానీ ఓ యయాతి రాజా..! నీలో యవ్వన దశ దాటిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది. కనుక అశ్రుబిందుమతి నిన్ను తిరస్కరిస్తోంది అని విశాల చెప్పింది. అప్పటికి కానీ యయాతికి తన వయస్సు ఎంత గడిచిందీ తెలిసిరాలేదు. అదేమిటో, ఈ వృద్ధాప్యం తనకు తెలియకుండా ముందు సూచనలేవీ ఇవ్వకుండా ఎలా తన శరీరానికి సంక్రమించిందోనని బాధపడ్డాడు. అలా వృద్ధాప్యం సంక్రమించినందుకు వ్యథ చెందుతూ కోరిన కోరిక తీరనందుకు బాధపడుతూ దిగాలుగా కూర్చున్నాడు యయాతి. ఆ సమయంలో విశాల ఓ సలహా చెప్పింది. వృద్ధాప్యాన్ని పోగొట్టుకొని నవ యవ్వనాన్ని సంపాదించుకుంటే అశ్రుబిందుమతి వివాహానికి ఒప్పుకుంటుంది. ఆ వివాహం జరగాలంటే ఓ ఉపాయం కూడా ఉంది. ఈ ఉపాయం శ్రుతులలోనే కనిపిస్తుంది. పుత్రుడు, సోదరుడు, సేవకుడు ఇలా వీరిలో ఎవరో ఒకరు వృద్ధాప్యాన్ని తీసుకొని వారి యవ్వనాన్ని ఇవ్వవచ్చు. కనుక ఆ దిశగా ఆలోచించమని యయాతికి విశాల చెప్పిన మాటలు ఆ రాజులో మళ్లీ ఆశను రేకెత్తించాయి.

యవ్వనాన్ని దానం చేసిన కుమారుడు
వెంటనే ఇంటికి వెళ్లి తన కుమారులను సమావేశపరచి తన విషయాన్ని చెప్పాడు. కుమారులలో ఒక్క పూరుడు తప్ప అందరూ యయాతి మాటను కాదన్నారు. పూరుడు తండ్రి చెప్పినట్టే చేశాడు. ఆ తర్వాత యయాతి ఆనందంతో అడవిలో అశ్రుబిందుమతి ఉన్న దగ్గరకు వచ్చాడు. కానీ ఆమె అప్పుడు కూడా నిరాకరించింది. దానికి కారణం యయాతి శర్మిష్ఠ, దేవయాని అనే ఇద్దరు భార్యలతో కలిసి ఉండటమేనని వారిని ఇద్దరినీ దూరంగానే ఉంచితేనే తాను వివాహానికి సమ్మతిస్తానంది. యయాతి సరేనన్నాడు. అలా చాలాకాలం గడిచింది. ఒకసారి రాజు తన జీవన గమనాన్ని విశ్లేషించి చూసుకొన్నాడు. వాస్తవం అర్థమైంది. ఎన్నెన్నో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, ప్రజానురంజకమైన పరిపాలన చేశాడు. స్వర్గంకన్నా తన రాజ్యన్నే మిన్నగా తీర్చిదిద్దాడు. అందుకు ప్రతిఫలంగా దీర్ఘాయువు దక్కింది కానీ వృద్ధాప్యాన్ని ఆపలేకపోయాడు. అది ఎప్పుడు ఎలా తన శరీరాన్ని ఆక్రమించిందో కూడా తెలుసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే కోరికలు అంతం లేనివని గ్రహించలేక కుమారుడి యవ్వనాన్ని తాను పొంది, తన వృద్ధాప్యాన్ని కుమారుడికి ఇవ్వటం లాంటివన్నీ సిగ్గువిడిచి కూడా చేశాడు. కానీ ఆ కోరికలు అంతం కావటం లేదు. అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాటి కోసం ఎంతకాలమని పాకులాడటం ఇక అనవసరం. ఆ కోర్కెలను పూర్తిగా నిరోధిస్తే తప్ప తన జీవితం సఫలం కాదని నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు. ఈ యయాతి జీవనానుభవాన్ని గమనిస్తే మనిషి సాంసారిక సుఖాలకు ఎంత వరకు విలువనివ్వాలనే విషయం స్పష్టమవుతోంది. ఆ స్పష్టమైన సందేశాన్ని సమాజానికి అందించటమే పద్మపురాణంలోని ఈ కథా సందర్భం లక్ష్యంగా కనిపిస్తుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net