Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu


అతిథి అంటే అంత గొప్ప
భారతీయ సనాతన సంప్రదాయంలో అతిథికి ఇచ్చే స్థానం అసామాన్యం. అతిథిని సాక్షాత్తూ దేవుడేనని పూజించి గౌరవించే సంప్రదాయం మనది. ఈ విషయాన్ని, దీనితోపాటుగా స్నేహం విలువను తెలియచెప్పే ఓ సుదీర్ఘ కథ మహాభారతం శాంతిపర్వంలో ఉంది. ఈ కథను నాడీజంఘుడి కథ, కృతఘ్నోపాఖ్యానం అని అంటారు. ఒక గొలుసుకట్టు కథలో ఏ కాలంనాటి మానవాళికైనా అనుసరించదగ్గవే అన్నట్టు అనేక నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసానికి కావలసిన సూచనలు ఈ కథలో ఉండటం విశేషం. యుధిష్ఠిరుడికి భీష్మాచార్యుడు ఈ కథను చెబుతూ తొలిగా సమాజంలో ఎదురయ్యే మనుషుల్లో మంచివారిని ఎలాంటి లక్షణాలు చూసి గుర్తించాలి అనే వివరాలను చెప్పాడు. ఆ తర్వాత నాడీజంఘుడి కథను ప్రస్తావిస్తూ భారతీయ సమాజంలో అతిథి పూజకు ఉన్న గౌరవ స్థానాన్ని వివరించాడు.

అతిథి మర్యాదలు తెలిసిన గజదొంగ...
వృత్తిపరంగా గజదొంగ కావచ్చు, కానీ ప్రవృత్తిపరంగా కొంతమంది ఎంతో మంచి లక్షణాలను కలిగిఉంటారు. అలాంటి వారికి ఉదాహరణగా కనిపించే ఓ బందిపోటు దొంగ పూర్వకాలం ఉండేవాడు. అదే రోజుల్లో ఓ వేదపండితుడి ఇంట్లో పుట్టి వేద అధ్యయనానికి దూరంగా దుర్మార్గ మనస్తత్వంతో గౌతముడు అనే మరో వ్యక్తి ఉంటూ ఉండేవాడు. తోటివారి మధ్య బతకటానికి తగినంత చదువు, సంస్కారం అతడికి లేవు. వూళ్లవెంట తిరుగుతూ అందరినీ యాచిస్తూ బతుకుతూ ఉండేవాడు. ఆ వ్యక్తి ఓసారి బందిపోటు దొంగ గురించి విని అతడు దొంగే అయినా మంచిదాత అని తెలుసుకొని ఆ దొంగ దగ్గరకు వెళ్లి యాచించాడు. వేదపండిత కుటుంబాల నుంచి వచ్చిన వారంటే బందిపోటు దొంగకు ఎంతో భక్తి, గౌరవం. ఆ భక్తితోనే తన దగ్గరకొచ్చిన యాచకుడి మీద కూడా చూపిస్తూ అతడి కోసం ఓ మంచి ఇల్లు, ఆ ఇంటి నిండా అవసరమైన సామగ్రి, పనులు చేసిపెట్టటానికి ఓ దాసిని ఏర్పాటు చేశాడు. తనను యాచించిన గౌతముడుకి బందిపోటు దొంగ అన్ని సౌకర్యాలనూ అలా కల్పించటంతో అక్కడే హాయిగా కాలక్షేపం చేయసాగాడు. తన కోసం నియోగించిన దాసితో సాంసారిక సుఖాలను అనుభవిస్తూ, బాణాలతో గురి చూసి జంతువులను వేటాడటంలాంటి హింసాత్మక పనులన్నింటినీ నేర్చుకున్నాడు. గౌతముడికి కల్పించిన సౌకర్యాలన్నీ బందిపోటు దొంగ అతిథి పూజలో భాగంగా భావిస్తూ మరిన్ని సౌకర్యాలను నిరంతరం ఏర్పాటు చేస్తుండేవాడు.

సన్యాసి హితబోధ..
ఇలా కాలం గడుస్తుండగా ఓ రోజున ఓ సన్యాసి తీర్థయాత్రలకు వెళుతూ మార్గమధ్యంలో ఆ గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఎవరైనా వేదపండితులు కానీ, ఆ కుటుంబాలకు చెందినవారు కానీ ఉన్నారా? అని అన్వేషిస్తూ ఉన్న సమయంలో ఎవరో గౌతముడి గురించి చెప్పారు. అక్కడికి వెళ్లి ఆ రాత్రికి ఆశ్రయం పొందుదామనుకున్నాడు సన్యాసి. మెల్లగా ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాడు. సన్యాసి వెళ్లే సమయానికే వేటకు వెళ్లిన గౌతముడు తన భుజాల మీద హంసల్లాంటి పక్షులతో ఉన్న వల, రక్తం అంటిన శరీరంతో తిరిగొచ్చాడు. సన్యాసి గౌతముడు గతంలో నివసించిన గ్రామానికి చెందినవాడే కావటంతో గౌతముడిని గుర్తించి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఇదేమిటి నీ తండ్రి తాతలు ఎంత గొప్ప సంస్కారం ఉన్నవారు, ఎంత గొప్పపండితులు. మరి నీవేమో ఇలా అయ్యావేమిటి అని హితబోధ చేశాడు. సన్యాసి మాటలు గౌతముడిని అప్పటికి బాగా ప్రభావితం చేశాయి. తాను మనసు మార్చుకుంటానని సన్మార్గంలో జీవితాన్ని నడుపుకొంటానని ఆ రాత్రికి తన ఇంట్లో అతిథిగా ఉండమని గౌతముడు సన్యాసిని వేడుకొన్నాడు. ఆ అతిథి అందుకు అంగీకరించాడు. కానీ హింసాప్రవృత్తితో ఉన్న అతడి ఇంట్లో మంచినీళ్లు తాగటానికి, భోజనం చేయటానికి ఇష్టపడక ఆ రాత్రికి ఆకలి బాధిస్తున్నా ఎలాగో ఒకలాగా కాలక్షేపం చేసి తెల్లవారిన తరువాత తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఇలా ఈ కథా సందర్భంలో దోపిడీ దొంగకు కూడా అతిథిపూజ మీద విశ్వాసం ఉండటం, అతిథికి కావలసినవన్నీ ఏర్పాటు చేయటం అనే విషయాలు, దాంతోపాటుగా దుర్మార్గుడైన గౌతముడు కూడా తన ఇంటికి వచ్చిన అతిథిని ఆ రాత్రికి తన దగ్గర ఆతిథ్యం స్వీకరించమని అడగటంలాంటివి గమనిస్తే భారతీయ సంప్రదాయంలో మనిషైపుట్టిన ప్రతివారికి అతిథి పూజ మీద ఎంత గౌరవం ఉందనే విషయం స్పష్టమవుతోంది. అతిథి పూజాసత్కారాలు పుణ్యప్రదాలనే నమ్మకమే దీనికి కారణం.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net